Advertisementt

‘వకీల్ సాబ్’పై అంత హైప్ వద్దంటున్నారు

Tue 09th Jun 2020 02:14 PM
vakeel saab,pawan kalyan,fans,craze,pawan vakeel saab,power star movie  ‘వకీల్ సాబ్’పై అంత హైప్ వద్దంటున్నారు
Fans Feeling on Pawan Kalyan Vakeel Saab ‘వకీల్ సాబ్’పై అంత హైప్ వద్దంటున్నారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండడంతో.. పవన్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోయి ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీని బాలీవుడ్ పింక్ రీమేక్ చెయ్యడంతో.. ఆ సినిమాపై అంతగా అంచనాలు రావడం లేదు. అందులోను మే లోనే విడుదల కావాల్సిన సినిమా కరోనా తో పోస్ట్ పోన్ అవడం కూడా వకీల్ సాబ్ మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గడానికి కారణమైంది. పవన్ గత సినిమాలకున్న క్రేజ్ వకీల్ సాబ్ పై రావడం లేదు.

అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం మా వకీల్ సాబ్ కి హైప్ రాకపోతేనే బెటర్ అంటున్నారట. ఎంతో హైప్ తో క్రేజ్ తో విడుదలైన అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అయినప్పుడు ఈ సినిమాకొచ్చిన క్రేజ్ చూసి పవన్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. అందుకే వకీల్ సాబ్ కి క్రేజ్ వద్దు, హైప్ వద్దు ఈ రేంజ్ లోనే సినిమా విడుదలైన రికార్డులు కొల్లగొట్టాలని పవన్ ఫ్యాన్స్ భావన అట. మరో పక్క ఈ సినిమా సబ్జెక్టు కూడా పక్కా కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు మరి ఎక్కువ అయితే.. చివరికి పవన్ ఫ్యాన్సే నిరాశ పడే అవకాశం ఉంది. కాబట్టి వకీల్ సాబ్ కు భారీ అంచనాలు లేకపోవడమే మంచిది.. అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

Fans Feeling on Pawan Kalyan Vakeel Saab:

Pawan Kalyan Fans wants no Craze to Vakeel Saab 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ