Advertisementt

మనం డైరెక్టర్ తో చైతన్య మూవీ.. రూటు మార్చనున్నాడా..?

Mon 08th Jun 2020 04:30 PM
naga chaitanya,vikram k kumar,manam,akhil,nani   మనం డైరెక్టర్ తో చైతన్య మూవీ.. రూటు మార్చనున్నాడా..?
Nagachaitanya movie with Manam Diector.. మనం డైరెక్టర్ తో చైతన్య మూవీ.. రూటు మార్చనున్నాడా..?
Advertisement
Ads by CJ

నాగచైతన్యకి మజిలీ సినిమా ద్వారా మంచి హిట్ లభించింది.  ఆ తర్వాత వెంకీ మామా రూపంలో ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తుంది. తెలంగాణ గ్రామీణ ప్రాంత కుర్రాడిగా చైతన్య నటన అదిరిపోనుందట. అన్నీ సవ్యంగా కుదిరితే ఈ పాటికి థియేటర్లో రిలీజ్ అయ్యేది.

అయితే ఈ సినిమా అనంతరం చైతన్య ఎవరితో సినిమా చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. మొదట నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు గానీ మరో దర్శకుడితో సినిమా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీకి మరిచిపోలేని విజయాన్నందించిన మనం చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ఉంటుందట.

అయితే గత కొన్ని రోజులుగా విక్రమ్ కె కుమార్ నిరాశపరుస్తూ వస్తున్నాడు. అఖిల్ హలో, నాని గ్యాంగ్ లీడర్ బాక్సాఫీసు వద్ద తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి. దాంతో విక్రమ్ కె కుమార్ చైతన్యని ఎలాంటి సినిమాలో చూపించబోతున్నాడనే ఆసక్తి ఎక్కువైంది. అయితే నాగచైతన్య హిట్ జోనర్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ని తెరకెక్కించనున్నాడట. మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ కె కుమార్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Nagachaitanya movie with Manam Diector..:

Naga chaitanya movie with Manam Director Vikram K Kumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ