భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ ‘జీ 5’. ఇందులో 100కు పైగా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ వీక్షకాదరణ సొంతం చేసుకుంటోంది. లాక్‌డౌన్ స్పెషల్‌గా విడుదలైన ‘అమృతం ద్వితీయం’ నవ్వులు పంచుతోంది. ఇటీవల ‘జీ 5’లో విడుదలైన ‘లూజర్’కి సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. వీక్షకులతో పాటు విమర్శకులను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా వీడియో కాలింగ్ ద్వారా డిజిటల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వెబినార్‌లో ‘జీ 5’ సౌతిండియన్ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల సహా ‘లూజర్’ టీమ్ పాల్గొన్నారు.
‘జీ 5’ సౌతిండియన్ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ ‘జీ 5’లో విడుదల చేసిన వెబ్ సిరీస్‌లు అన్నిటిలో ‘లూజర్’ టాప్‌లో ఉంది. ‘జీ 5’లో మాత్రమే కాదు, సౌతిండియాలో విడుదలైన వెబ్ సిరీస్‌లలో ‘లూజర్’ వన్నాఫ్ ది బెస్ట్ సిరీస్‌గా నిలిచిందని గర్వంగా చెప్పగలను. అభిలాష్ కథ చెప్పినప్పుడు 1980 నేపథ్యంలో క్రికెట్, 1990 నేపథ్యంలో బ్యాడ్మింటన్, 2000లో రైఫిల్ షూటింగ్‌ను ఎలా కనెక్ట్ చేస్తాడని అనుకున్నా. కంప్లీట్ ఎపిసోడ్ డీటెయిల్స్‌తో చెప్పినప్పుడు ఇంకా చాలా బావుంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. ప్రియదర్శిని చూసినప్పుడు... తమ్ముడిని కొట్టే సన్నివేశంలో నిజంగానే కొడుతున్నాడా? అనిపించింది. విల్సన్ డోర్ పగలకొట్టి లోపలకి వచ్చినప్పుడు కోమలీ ప్రసాద్ ఇచ్చిన టిపికల్ హౌస్‌వైఫ్ రియాక్షన్... ప్రతి ఇక్కరూ పాత్రల్లో జీవించారు. ఎప్పుడూ పాతబస్తీకి వెళ్లని యానీ, రూబీ పాత్రలో ఎంతో అద్భుతంగా చేసింది. ‘జీ 5’ ఫ్యామిలీ తరఫున అద్భుతంగా నటించిన ‘లూజర్’ నటీనటులకు, గొప్ప వెబ్ సిరీస్ అందించిన అభిలాష్, ఇతర టెక్నికల్ టీమ్, నాణ్యతతో కూడిన చిత్రాలు, వెబ్ సిరీస్ అందించే అన్నపూర్ణ స్టూడియోస్‌కి థ్యాంక్స్. వెబ్ సిరీస్‌లో సాంగ్స్ అంటే కొంచెం డౌట్ ఉంటుంది. ఫార్వార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ, అభిలాష్ తొలి పాట వినిపించినప్పుడు మిగతా రెండు పాటలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురు చూశా’’ అని అన్నారు.
‘లూజర్’ దర్శకుడు అభిలాష్ మాట్లాడుతూ.. ‘‘నాకు స్నేహితుడు మీర్ కస్టమ్ ఆఫీసు నుండి ఒక ఎయిర్ రైఫిల్ గన్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులకు క్రికెట్, బ్యాడ్మింటన్ తెలుసు. ఎయిర్ రైఫిల్ గురించి తెలియదు. అందులో స్ట్రగుల్ గురించి స్నేహితుడి ద్వారా నాకు తెలిసింది. ఆ లైన్ తీసుకొని క్యారెక్టర్స్, కథ రాసి ‘జీ 5’ ప్రసాద్‌గారికి చెప్పా. ఆయన కథ బాగా నచ్చిందన్నారు. వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ మేడమ్‌కి చెప్పా. ఆవిడకూ కథ బాగా నచ్చింది. నటీనటులు, ఇతర బృందమంతా కథను నమ్మారు. ‘చాలామంది కథ రాయడానికి ఏడాది పట్టిందా?’ అని అడిగారు. మూడు నెలల్లో రాశామంతే! నాతో పాటు భరద్వాజ్, శ్రవణ్ కథపై వర్క్ చేశారు’’ అన్నారు.
‘లూజర్’లో సూరి పాత్రలో నటించిన ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘‘ప్రసాద్‌గారికి కంగ్రాట్స్. ఇప్పుడు ఆయన ‘జీ 5’ సౌతిండియా హెడ్. ఇక, ‘లూజర్’ ప్రయాణానికి వస్తే స్ర్కిప్టే నా బైబిల్. అదే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పటివరకూ నేను రైఫిల్ షూటర్ క్యారెక్టర్ చేయలేదు. తొలుత కొంచెం భయపడినా చేశా. అభిలాష్, భరద్వాజ్, సాయి... అందరూ సిరీస్ బాగా రావడానికి కృషి చేశారు. ఓ 30 రోజులు రైఫిల్ షూటింగ్‌లో నీలకంఠగారు నాకు ట్రయినింగ్ ఇచ్చారు. గొప్ప బృందంతో కలిసి పని చేశా. వాళ్ల భుజాలపై నేను ప్రయాణించానని చెప్పాలి. శ్రీరామ్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. ‘లూజర్’ ఇంత పెద్ద విన్నర్ కావడం వెనుక సుప్రియ మేడమ్ పెద్ద పాత్ర పోషించారు. సిరీస్ బాగా రావడానికి సుప్రియగారు, ప్రసాద్‌గారు ఎంతో కృషి చేశారు’’ అని అన్నారు.
‘లూజర్’లో విల్సన్ పాత్రలో నటించిన శశాంక్ మాట్లాడుతూ.. ‘‘విల్సన్ కోసం నేను చాలా చేయాల్సి వచ్చింది. తనకు ఏం కావాలి? ఏం వద్దు? అనే విషయంలో అభిలాష్ చాలా క్లారిటీతో ఉంటాడు. తను చెప్పింది ఫాలో కావడం పెద్ద ఛాలెంజ్. విల్సన్ బౌలర్ కాబట్టి మూడు నెలలు ట్రయినింగ్ తీసుకున్నాను. ‘లూజర్’లో బ్యాడ్మింటన్ కోచ్‌గా నటించిన చంద్ర, రియల్ లైఫ్‌లో నా క్రికెట్ బౌలింగ్ కోచ్. అతని టిప్స్ చాలా హెల్ప్ అయ్యాయి. లుక్ పరంగా చూసుకున్నా... యంగ్ విల్సన్‌కి, ఓల్డ్ విల్సన్‌కి సంబంధం ఉండదు. యంగ్ విల్సన్‌కి 8 కిలోలు తగ్గా. మళ్లీ ఓల్డ్ విల్సన్ కోసం 16 నుండి 18 కిలోలు పెరిగా. యంగ్ విల్సన్ సీన్స్ షూటింగ్ చేశాక... రెండు నెలలు బరువు పెరిగి ఓల్డ్ విల్సన్ సీన్స్ చేశా. ఇప్పుడు బరువు తగ్గుతున్నా. మరో రెండు నెలలకు పర్‌ఫెక్ట్ ఫిజిక్‌లోకి వస్తా. ఓవరాల్‌గా ‘లూజర్’ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మా టెక్నికల్ టీమ్, ఆడియన్స్ రియల్ విన్నర్స్. ఇప్పుడు మేం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
‘లూజర్’లో యంగ్ రూబీగా నటించిన యానీ మాట్లాడుతూ.. ‘‘అభిలాష్ అన్న స్ర్కిప్ట్ చెప్పిన వెంటనే ‘నా దేశం కోసం ఆడుతున్నాను’ అనే పాయింట్‌కి నాకు నచ్చింది. దానికి కనెక్ట్ అయ్యా. నాకు ఎప్పడి నుండో ఇటువంటి రోల్ చేయాలని ఉంది. నేను నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్. మా టీమ్ వల్లే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అభిలాష్ అన్న, చంద్ర సార్, సుదీప్ అన్న, వరుణ్ అన్న అందరూ చాలా కష్టపడ్డారు. ‘లూజర్’ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది అమ్మాయిలు నాకు మెసేజ్‌లు చేశారు. ‘రూబీ పాత్రలో మమ్మల్ని చూసుకున్నాం’ అని చెప్పారు. జీవితంలో చాలా సాధించగలమనే విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. చాలా గొప్పగా అనిపించింది’’ అని అన్నారు.
‘లూజర్’లో రూబీ పాత్ర పోషించిన కల్పికా గణేష్ మాట్లాడుతూ.. ‘‘చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకూ ప్రతి దశలో మహిళ ఎన్నో అడ్డంకులు, కష్టాలు ఎదుర్కొంటుంది. వాటి గురించి కొంతమంది మాట్లాడతారు. కొందరు మాట్లాడలేరు. నేను చెప్పేది ఒక్కటే... అందరూ తమ ప్రతిభను నమ్ముకోవాలి. రూబీ ఎటువంటి సమస్యలు ఎదుర్కొందో, అటువంటి సమస్యల వల్ల కెరీర్ వదులుకోవాలనుకున్న చాలామంది అథ్లెట్స్ నాకు మెసేజ్‌లు చేశారు. ‘లూజర్’ ప్రతి ఒక్కరి జీవితం’’ అని అన్నారు.
పల్లవి పాత్రలో నటించిన పావని గంగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్ సిరీస్‌లో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. పల్లవిది సాఫ్ట్ నేచర్. కానీ, సమయం వచ్చినప్పుడు తన కోసం తాను నిలబడుతుంది. క్యారెక్టర్‌తో నేను బాగా కనెక్ట్ అయ్యా. ‘లూజర్’ చూశాక నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరు 15 ఏళ్లుగా ఎవరికీ చెప్పని తన సమస్యను నాకు చెప్పింది. వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు’’ అని అన్నారు.
ఆశా పాత్రలో నటించిన కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘జీ5 సౌతిండియన్ హెడ్‌గా నియమితులైన సందర్భంగా ప్రసాద్ సార్‌కి కంగ్రాట్స్. ‘లూజర్’ తర్వాత నా పేరు ఆశ అయిపోయింది. అభిలాష్ కథతో వచ్చినప్పుడు ‘చేయగలనా? లేదా?’ అని నేను కొంచెం సందేహపడ్డా. అయితే, ‘నువ్వే నా ఆశ’ అని అభిలాష్ చెప్పారు. అతని జడ్జ్‌మెంట్ నమ్మి చేశా. ఆశ మాత్రమే కాదు, ‘లూజర్’లో ప్రతి మహిళ పాత్రను అందంగా తీర్చిదిద్దారు. ఆశ, రూబీ, పల్లవి.... ప్రేమించిన వ్యక్తి కోసం మహిళలు ఎవరైనా ఎంత త్యాగం చేస్తారనేది చూపించారు. ఈ సిరీస్ చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘అభిలాష్, జీ 5, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్, నా మ్యూజిక్ టీమ్‌కి థ్యాంక్స్. ఇంత క్వాలిటీ మ్యూజిక్ వచ్చిందంటే కారణం వాళ్లే. పాటలకు బాణీలు కట్టడం ప్రారంభించడానికి ముందే నేను, అభిలాష్ గంటల తరబడి చర్చించుకునేవాళ్లం. పాటలు ఎక్కడ కావాలి? ఎక్కడ వద్దు? అని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత పాటలకు బాణీలు అందించా. పదేళ్లుగా అభిలాష్ నాకు తెలుసు. తన టేస్ట్ తెలియడం, నటీనటులు అద్భుతంగా నటించడంతో నా పని ఈజీ అయింది’’ అని అన్నారు.
ఇంకా ‘లూజర్’ సినిమాటోగ్రాఫర్ నరేష్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధి–క్రియేటివ్ ప్రొడ్యూసర్ మహేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌చంద్ర తదితరులు మాట్లాడారు.