అప్పుడెప్పుడో బాలకృష్ణ గురించి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ మాట్లాడి యూట్యూబ్ లో హడావిడి చేసిన నాగబాబు.. మళ్లీ బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దలపై చేసిన కామెంట్స్ ని అడ్డం పెట్టుకుని.. బాలకృష్ణ ఇండస్ట్రీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశాడు. బాలయ్య నువ్వు ఇండస్ట్రీకి కింగ్ వి కాదు హీరోవి అంటూ సవాల్ చేసాడు. తాజాగా నాగబాబుకు ఏమైందో ఏమిటో ప్లేట్ ఫిరాయించాడు. బాలకృష్ణ అంటే తనకి కోపం లేదని.. ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవని అంటున్నాడు. అయన రియల్ ఎస్టేట్ అంటూ మాట్లాడిన మాటల విషయంలోనే తాను ఆవేశపడ్డాను కానీ.... బాలకృష్ణపై కోపంతో కాదని.. ఆయనంటే నాకు గౌరవం ఉందని అంటున్నాడు.
నేను బాలకృష్ణని టార్గెట్ చెయ్యలేదు.. కేవలం ఆయన మాట్లాడిన మాటలు తప్పని చెప్పాను అంతే. బాలకృష్ణ పెద్ద హీరో. ఆయనతో నేను సమానమని ఎప్పుడు భావించను. నేను చిరు తమ్ముడ్ని, నేనొక నిర్మాతని, అంతేకాదు ఓ నటుడిని మాత్రమే. నాకు బాలకృష్ణ అంటే వ్యక్తిగత కక్ష ఏం లేదు అంటున్నాడు. అసలు నాకు పర్సనల్ గా బాలకృష్ణ తో పెద్దగా పరిచయమే లేదు.. బయటెక్కడన్నా కలిస్తే మాత్రం హాయ్ అంటే హాయ్ అనుకుంటాము.
బాలయ్య కూడా ఆయన మాట్లాడిన మాటల మీద రియలైజ్ అయ్యాడు. అసలు ఈ మాటలు ఎవరు మాటలాడినా నేనిలాగే రియాక్ట్ అయ్యేవాడని. మా ఇండస్ట్రీ గొడవలు టీ కప్పులో తుఫాను లాంటిది.. కానీ మా మధ్యన ఏం జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధంలా మీడియా పెద్దది చేసి చూపెడుతుంది అంటూ అంతా మీడియా మీద నెపం నెట్టేశాడు నాగబాబు. అసలు నాగబాబు మళ్లీ ఇలా మాట్లాడడానికి కారణం పవన్ కళ్యాణ్ అని, కాదు చిరు చెప్పడం వల్లనే నాగబాబు ఇలా ప్లేట్ ఫిరాయించాడని అంటున్నారు.