కరోనా మూలంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ని దశలవారిగా సడలిస్తూ వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగులకి కూడా అనుమతులు లభించే అవకాశం ఉంది. అయితే లాక్డౌన్ టైమ్ లో సినిమా సెలెబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వినియోగించుకున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లా క్డౌన్ వల్ల చాలా విషయాలు తెలుసుకుందట.
కరోనా ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందో తెలియని సమయంలో జీవితం ఎంత చిన్నదో అర్థమైందట. మనిషి ఎంతో సాధించినా, ఇంకా సాధించాల్సి ఉందన్న విషయం అర్థమైందట. అంతే కాదు ప్రకృతిలో భాగమైన మనం, మరొకరికి హెల్ప్ చేయాలని, అలా చేసుకుంటూ వెళ్తేనే మనిషి మనుగడ సాగుతుందని తెలుసుకుందట. ఇక్కడ ఎవరమూ ఉండిపోవడానికి రాలేదని, అందుకే మనకు తోచినంతలో ఇతరులకి సాయం చేయాలని, అలాగే మనకి జన్మనిచ్చిన భూమికి ఏదైనా చేయాలని అర్థం అయిందట.
మొత్తానికి బాలీవుడ్ బ్యూటీ ఒక్కసారిగా వేదాంతం మాట్లాడుతుంది. జాక్వెలిన్ ఇలా మాట్లాడటం కొంత ఆశ్చర్యం కలిగించినా, ఆమె చెప్పిన మాటలు వాస్తవాలేనని అంటున్నారు. జాక్వెలిన్ ప్రస్తుతం జాన్ అబ్రహం సరసన ఎటాక్ అనే చిత్రంలో నటిస్తుంది. మొన్నటికి మొన్న మిసెస్ సీరియల్ కిల్లర్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.