Advertisementt

ఒంటరితనం ఇప్పుడు అలవాటైంది కాదు..శృతి హాసన్

Mon 08th Jun 2020 06:51 AM
shruti hasan,raviteja,lockdown celebrities,krack  ఒంటరితనం ఇప్పుడు అలవాటైంది కాదు..శృతి హాసన్
Shruti hasan about her loneliness.. ఒంటరితనం ఇప్పుడు అలవాటైంది కాదు..శృతి హాసన్
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న శృతి హాసన్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం మానేసింది. తాను ప్రేమించిన మైఖేల్ కోర్సలేతో  బ్రేకప్ చేసుకున్నాక మళ్ళీ సినిమాల్లోకి నటించడానికి ముందుకు వచ్చింది. అయితే మొన్నటికి మొన్న నాకు మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే తన లవర్ తో బ్రేకప్ చేసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు వచ్చాయని అనుకున్నారు.

అయితే అలా కావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పింది. తనకే కాదు ప్రతీ మనిషీ ఏదో ఒక టైమ్ లో ఇలాంటి ఇబ్బందులు పడతాడని వివరించింది. ప్రస్తుతానికి శృతి హాసన్ ఒంటరిగానే ఉంటుందట. లాక్డౌన్ కి ముందునుంచి ముంబైలోనే ఉంటున్న శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఒక్కరే ఉండడం వల్ల బోర్ అనిపించదా అని అడిగితే, ఒంటరితనం నాకెప్పుడో అలవాటైంది. 19 ఏళ్ళప్పుడు చదువు కోసం అమెరికాకి వెళ్ళినప్పటి నుండి నేను ఒంటరిగానే ఉంటున్నానని సమాధానం ఇచ్చింది.

ఇష్టమైన పుస్తకాలని చదువుతూ, మ్యూజిక్ ప్రాక్టీసు చేస్తూ హాయిగా ఉన్నానని, ఇలాంటి ఏకాంతం తనకి చాలా ఇష్టమని, మానసికంగా, శారీరకంగా బలంగా తయారవడానికి ఏకాంతం మంచి మందులా పనిచేస్తుందట. ఏదైమైతేనేం శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shruti hasan about her loneliness..:

Shruti hasan about her loneliness..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ