కీర్తి సురేశ్ - పెంగ్విన్ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్న తాప్పీ పన్ను, సమంత, మంజువారియర్, త్రిష
‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ అప్ కమింగ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ పెంగ్విన్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎమోజాన్ ప్రైమ్ వీడియో వారు జూన్ 19న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంగ్విన్ టీజర్ ను జూన్ 8న విడుదల చేయడానికి ఎమెజాన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టీజర్ ను తెలుగు, మళయాల, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
స్టార్ హీరోయిన్లు తాప్సీ పన్ను, సమంత, మంజు వారియర్, త్రిష ఈ టీజర్ ని జూన్ 8న తమ ట్విట్టర్ ఖాతాలు ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ అధికారికంగా ప్రకటించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకం పై దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు.