టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అలివేలు మంగ వెంకట రమణ సినిమా రూపుదిద్దుకోనుంది. గత కొన్నేళ్ళుగా గోపీచంద్ కెరీర్లో విజయమే లేదు. అయినా కూడా తేజ, గోపీచంద్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే విషయంలో తర్జన భర్జనకి గురవుతున్నారు. ముందుగా తేజ, అలివేలు మంగ పాత్రని చేయడానికి కాజల్ సరైన హీరోయిన్ అని అనుకున్నాడట.
కానీ ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ ఆచార్యతో పాటు, మంచు విష్ణు మోసగాళ్ళు, ముంబయి సాగా, ఇండియన్ 2 వంటి బడా సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తిచేయడానికి చాలా టైమ్ పడుతుంది. తేజకి అంత సమయం లేదు. దాంతో అనుష్కని తీసుకుందామని భావించాడు. కానీ అనుష్క ఈ సినిమాని ఒప్పుకుంటుందో లేదో అనేది సందేహమే. అదీగాక ఈ మధ్య అనుష్క ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపిస్తుంది.
అందువల్ల తేజ మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు. రకుల్ ప్రీత్ అయితే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డాడట. రకుల్ తెలుగు సినిమాల్లో కనిపించక చాలా రోజులైంది. అంతే కాకుండా ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. ఒక్క సినిమా ఉన్నా కూడా అది ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేదు. దాంతో రకుల్ ప్రీత్ అయితే అన్ని విధాలుగా పర్ ఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారట. అధికారిక సమాచారం వస్తేనే గానీ అలివేలు మంగగా ఎవరు నటిస్తున్నారో తెలియదు.