సమంత ఎప్పుడూ సినిమాలతో కెరీర్ ని బిజీ బిజీగా గడిపేసింది. పెళ్ళికి ముందు సదా బిజీగా ఉన్న సమంత పెళ్లి తర్వాత ఖాళీ ఎమన్నా దొరికితే.. భర్త నాగ చైతన్య తో సమయాన్ని గడపటమే సమంతకి తెలుసు. కానీ కరోనా లాక్ డౌన్ తో భర్త తో కావాల్సిన టైం ని స్పెండ్ చేస్తుంది. కొత్త కొత్త వంటలను నేర్చుకుంటుంది. ఎప్పుడూ చైతు వండితే తినే సమంత ఇప్పుడు భర్త నాగ చైతన్య కోసం రకరకాల వంటలు చేస్తుంది. అది కూడా ఓ టాప్ న్యూట్రీషియన్ దగ్గర వంటల్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. అంతేకాదు.. 50 సినిమాల్లో అలవోకగా నటించిన నాకు ఇప్పటికి కొబ్బరికాయ కొట్టడం రాదని.. ఎన్ని సినిమాల్లో కొబ్బరికాయ కొట్టినా ఇప్పటికి సరిగా కొట్టలేకపోతున్నట్లుగా చెబుతూ ఓ ఫోటో షేర్ చేసింది సమంత.
ఇక న్యూట్రీషియన్ శ్రీదేవి టెర్రస్ పై ఉన్న కూరగాయల మొక్కలు, ఆకుకూరల మొక్కలు చూసి చాలా ఝలస్ ఫీల్ అయ్యా అని.. ఇప్పుడు నా టెర్రస్ మీద కూడా కూరగాయలు పండించడానికి ఏర్పాట్లు చేశాను అని... పొద్దున్నే లేచి తాను పెంచుకున్న మొక్కలు చూసి మురిసిపోతుంది. తీరిక దొరికితే గార్డెనింగ్ చెయ్యడం చాలా ఇష్టమని అందరిని గార్డెనింగ్ చేస్తూ జిమ్ చెయ్యమంటుంది. మనం తినే ఆహారానికి ఎన్ని కష్టాలు పడితే వస్తుందో నాకు ఇన్ని రోజులకి గాని అర్ధమవలేదు అని చెబుతుంది సమంత. నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడానికి కష్టపడే వారందరికీ నా ధన్యవాదాలు అంటుంది సమంత. మన టేబుల్ మీదున్న ఆహారం సిద్దమవడానికి ఎంతగా కష్టపడాలో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది అని చెబుతుంది.