Advertisementt

బ్యూటీ క్వీన్స్ వెంట‌ప‌డుతున్న నాగ్‌!

Sun 07th Jun 2020 02:49 PM
nagarjuna,beauty queens,sushmita sen,aishwarya rai,dia mirza,juhi chawla,tollywood,manmadhudu  బ్యూటీ క్వీన్స్ వెంట‌ప‌డుతున్న నాగ్‌!
Nagarjuna Interest on beauty Queens revealed బ్యూటీ క్వీన్స్ వెంట‌ప‌డుతున్న నాగ్‌!
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున సినిమాలంటేనే గ్లామర్ మ‌యం. ద‌క్షిణాది భామ‌ల‌తో పాటు ఉత్త‌రాది సుంద‌రీమ‌ణుల‌తోనూ నాగ్ ప‌లు సంద‌ర్భాల్లో ఆడిపాడారు. అంతేకాదు.. మ‌రే ద‌క్షిణాది క‌థానాయ‌కుడికి ద‌క్క‌ని ఓ అరుదైన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కు ఉంది. అదేమిటంటే.. అందాల పోటీల్లో కిరీటాలు గెలిచిన ప‌లువురు బ్యూటీ క్వీన్స్‌తో ఆడిపాడిన వైనం సౌత్‌లో ఒక్క ఈ మ‌న్మ‌థుడుకే సొంతం.

అల‌నాటి ‘విక్కీ దాదా’లో మిస్ ఇండియా (1984) జూహీ చావ్లాతో జ‌ట్టుక‌ట్ట‌డం మొద‌లుకుని.. నేటి ‘వైల్డ్ డాగ్’ కోసం మిస్ ఆసియా ప‌సిఫిక్ (2000) దియా మీర్జాతో క‌ల‌సి న‌టించ‌డం వ‌ర‌కు ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్నాడు ఈ అక్కినేని అంద‌గాడు.

ఓ సారి అలా గ‌తంలోకి వెళితే.. ‘మిస్ ఇండియా’ కిరీట సుంద‌రి జూహీ చావ్లాతో ‘విక్కీ దాదా’ (1989), ‘శాంతి క్రాంతి’ (1991) చిత్రాల్లో అల‌రించిన నాగ్... ఆపై ఏకంగా ‘మిస్ యూనివ‌ర్స్’ (1994) కిరీటం అందుకున్న సుస్మితా సేన్‌తో ‘ర‌క్ష‌కుడు’ (1997)లో ఆడిపాడాడు. విశేష‌మేమిటంటే... ద‌క్షిణాదిలో సుస్మిత‌ న‌టించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం. ఆమె ‘మిస్ యూనివ‌ర్స్’ కిరీటం గెలిచిన ఏడాదిలోనే ‘మిస్ వ‌ర‌ల్డ్’గా నిలిచిన ఐశ్వ‌ర్య రాయ్‌తోనూ నాగ్ ‘రావోయి చంద‌మామ‌’ (1999)లో స్పెష‌ల్ సాంగ్‌ చేశాడు. తెలుగులో మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌ క‌నిపించిన ఏకైక చిత్రం ఇదే కావ‌డం విశేషం.

క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంత‌రం ఇప్పుడు ‘మిస్ ఆసియా ప‌సిఫిక్’ దియా మీర్జాతో క‌ల‌సి ‘వైల్డ్ డాగ్’లో న‌టిస్తున్నాడు నాగార్జున‌. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ కాప్ స్టోరీ.. విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది. కేట‌గిరి ఏదైనా.. అందాల పోటీల్లో కిరీటం అందుకున్న ఇంద‌రి భామ‌ల‌తో రొమాన్స్ చేయ‌డం ఒక్క నాగ్‌కే చెల్లింది. ఎటొచ్చీ... వారి కాంబినేష‌న్‌లో స‌క్సెస్ రేటే అంతంత మాత్రం. మ‌రి.. దియాతోనైనా నాగ్ ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి.. కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడేమో చూద్దాం.

Nagarjuna Interest on beauty Queens revealed:

Nagarjuna Record with Beauty Queens 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ