Advertisementt

చరణ్ కోసం.. ఎన్టీఆర్‌ని కన్విన్స్ చేశారా?

Sun 07th Jun 2020 01:36 PM
ss rajamouli,ram charan,rrr,jr ntr,acharya,shooting,update  చరణ్ కోసం.. ఎన్టీఆర్‌ని కన్విన్స్ చేశారా?
RRR Update: First Charan next Jr NTR చరణ్ కోసం.. ఎన్టీఆర్‌ని కన్విన్స్ చేశారా?
Advertisement
Ads by CJ

కరోనా లాక్‌డౌన్ కారణంగా పెద్దపెద్ద సినిమా షూటింగ్స్ అన్ని వాయిదా పడినాయి. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అని అందరూ కాచుకుని కూర్చున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో బడా ప్రాజెక్ట్స్ అయినా RRRకి, ఆచార్య కి ఓ లింక్ అయ్యింది. ఎందుకంటే RRR రామ్ చరణ్ షూటింగ్ పూర్తవగానే ఆచార్య కోసం రామ్ చరణ్ రావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ అంతా తారుమారు చేసింది. ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ అయినా ఇంపార్టెంటే. నిర్మాతలకు మరింత లేటయితే కష్టం. మరి రామ్ చరణ్ అటు RRR ఇటు ఆచార్య కోసం బాగా నలిగిపోతున్నాడు. అయితే తాజాగా రాజమౌళి RRR షూటింగ్ మొదలు కాగానే ముందుగా రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ అన్ని తెరకెక్కించి... ఆచార్య కోసం రామ్ చరణ్ ని పంపేస్తాడట. ఆ విషయంగా ఇప్పటికే రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే అదంతా ఓకే ఆచార్య కోసమే రామ్ చరణ్ ని పంపడానికి చరణ్ సీన్స్ షూట్ చెయ్యడానికి రాజమౌళి తొందరపడుతున్నారు. మరి ఎన్టీఆర్ విషయము అంటే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ RRR పూర్తి చెయ్యడానికి తహతహలాడుతున్నాడు. కానీ ఇప్పుడు చరణ్ సీన్స్ ముందు ఎన్టీఆర్ తర్వాత అంటే ఎన్టీఆర్ కి అన్యాయమే. కాకపోతే చిరు - కొరటాల సినిమాలో రామ్ చరణ్ వన్ అఫ్ ద పార్ట్. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. రామ్ చరణ్ లేటయితే సినిమా షూట్ లేటవుతుంది. కానీ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ షూట్ మొదలవలేదు కాబట్టి.. ఎన్టీఆర్ కి కాస్త ఆలస్యమైనా పర్లేదు అని రాజమౌళి ఎన్టీఆర్ ని కన్విన్స్ చేసాడని చెబుతున్నారు.

RRR Update: First Charan next Jr NTR:

Rajamouli planning For RRR Shooting 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ