ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సారి కూడా హయ్యెస్ట్-పెయిడ్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఫోర్బ్స్ ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం భారత్‌కు కలిసి రాలేదు. అత్యధికంగా ఆర్జించిన ప్రపంచంలోని టాప్ 100 సెలబ్రిటీస్‌లో భారత్‌కు సంబంధించి ఒకే ఒక్కడు చోటు సంపాదించాడు. ఆయన.. అక్షయ్‌కుమార్! అవును. కాకపోతే ఆయన ఒకే ఏడాది రూ. 366 కోట్లు ఆర్జించడం మాత్రం మైండ్ బ్లాక్ చేసే విషయం. గత ఏడాది కూడా టాప్ 100 వరల్డ్ హయ్యెస్ట్-పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో అక్షయ్ స్థానం పొందాడు. అప్పుడు ఆయన ర్యాంక్ 33. ఇప్పుడు 19 స్థానాలు తగ్గి 52వ స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆయనకు చోటు కల్పించింది ‘బెల్ బాటమ్, బచ్చన్ పాండే’ సినిమాలు.
2019లో అమెజాన్ కంపెనీతో ‘ది ఎండ్’ అనే వెబ్ సిరీస్ డీల్‌పై సంతకం చేశాడు అక్షయ్. ఈ డీల్‌తో అక్షయ్‌కు రూ. 75 కోట్లు లభించాయి. ‘ది ఎండ్’ అనేది యాక్షన్ థ్రిల్లర్. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఈ సిరీస్ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ఇక రెండు సినిమాలకు సంతకం చేయడం ద్వారా ఆయన మరో రూ. 100 కోట్లు అందుకున్నాడు. అవి.. ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్ పాండే’. , వీటితో ఇండియాలో అత్యధికంగా ఆర్జిస్తున్న సెలబ్రిటీగా అక్షయ్ నిలిచాడు. ఈ విషయంలో ఆయన అంకితభావం, కష్టపడేతత్వం ప్రధాన పాత్ర పోషించాయనేది నిజం.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాదితో పోలిస్తే 2020లో ఆయన స్థానం కిందకి దిగిందని ఫోర్బ్స్ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ సరికి ‘లక్ష్మీ బాంబ్’ మూవీ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సూర్యవంశీ’ మూవీ అయితే మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా, నిరవధికంగా వాయిదాపడింది. ఏదేమైనా అక్షయ్‌కుమార్ సాధించినదానికి ఆయనకు అభినందనలు తెలపాల్సిందే.
అమెరికన్ మోడల్, సోషలైట్ కైలీ జెన్నర్ వరల్డ్ హయ్యెస్ట్-పెయిడ్ సెలిబ్రటీగా నిలవగా, టాప్ 10లో హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ (ద రాక్), ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో చోటు పొందారు.