ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ ఓ కొలిక్కి వచ్చింది. సినిమా థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరవకపోయినా... సినిమా షూటింగ్స్‌కి ఆయా ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చేలా కనబడుతుంది. ఇప్పటికే బాలీవుడ్‌కి మహారాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు షూటింగ్స్‌కి ఇచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ముగియగానే అన్ని భాషల సినిమాలు పొలోమని పట్టాలెక్కడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. అందులో పెద్ద పెద్ద సినిమాలు RRR, ఆచార్య, పుష్ప లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఏ సినిమాకి రాని.... లేని అడ్డంకులు ఇప్పుడు సుకుమార్ - బన్నీ సినిమా పుష్పకి వచ్చేలా కనబడుతుంది వ్యవహారం.
ఎందుకంటే మిగతా సినిమా షూటింగ్స్ దేశం దాటి వెళ్లలేకపోయినా.. ఇక్కడే ఏదో ఒక సెట్ వేసి పనికానిస్తారు. కానీ బన్నీ పుష్ప కి అలా కాదు. ఏకంగా అడవి సెట్ వెయ్యాలి. అది సాధ్యం కానీ పని.. మరి లాక్ డౌన్ ముగిసిన పుష్ప ఇప్పుడప్పుడే అడవులకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదంటున్నారు. ఖచ్చితంగా అడవుల నేపథ్యంలోనే ఈ షూటింగ్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ మరో రెండు మూడు నెలలు రిలాక్స్ అవడానికి రెడీ అయితే... సుకుమార్ మాత్రం బాగా టెన్షన్ పడుతున్నాడట. రంగస్థలం వచ్చి రెండేళ్లయినా.. ఇప్పటికి కొత్త సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లలేక నానా తంటాలు పడుతున్న సుకుమర్ కి కరోనా కూడా అడ్డు పడింది.
ఇక ఇప్పట్లో అడవులకి వెళ్లలేకపోతే ఏమైనా ఇక్కడే ప్లాన్ చెయ్యొచ్చా అని సుకుమార్ ఆర్ట్ డైరెక్టర్స్ ని మీట్ అయ్యి చర్చలు జరుపుతున్నాడట. మరోపక్క హీరోయిన్ రశ్మిక కూడా ఇప్పుడప్పుడే షూటింగ్ కి రావాలంటే కుదరదని.. కరోనా ఉధృతి తగ్గాకే సెట్స్ లో జాయిన్ అవుతాయని చెప్పినట్లుగా టాక్. మరి పుష్ప కి అన్ని సినిమాలకన్నా కూసింత ఎక్కువ బాధలే ఉన్నాయన్నమాట.