Advertisementt

ఉప్పెన విషయంలో సుకుమార్ హ్యాపీ.. రన్ టైమ్ లాక్డ్..!

Fri 05th Jun 2020 01:48 PM
uppena,vaishnav tej,sukumar,mythri movie makers,krithi shetty,devi sri prasad  ఉప్పెన విషయంలో సుకుమార్ హ్యాపీ.. రన్ టైమ్ లాక్డ్..!
Sukumar happy with Uppena fginal cut..Run time locked ఉప్పెన విషయంలో సుకుమార్ హ్యాపీ.. రన్ టైమ్ లాక్డ్..!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలోని నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అనే పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ఈ పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసాయి. కరోనా వల్ల థియేటర్లు మూతబడడంతో ఉప్పెన ఓటీటీలో విడుదల అవుతుందంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ చిత్రబృందం వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తారట. అయితే ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ ఈ మధ్యే పూర్తయిందట. ఫైనల్ ఔట్ ఫుట్ ని చూసిన నిర్మాత సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నాడట.

ఫైనల్ ఎడిటింగ్ పూర్తి కావడంతో రన్ టైమ్ లాక్ చేసారట. 2 గంటల 30నిమిషాలకి లాక్ చేసారని వార్తలు వస్తున్నాయి. మెగా మేనల్లుడు పరిచయం కాబోతున్న ఈ సినిమా థియేటర్లు తెర్చుకోగానే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Sukumar happy with Uppena fginal cut..Run time locked:

Sukumar happy with Uppena fginal cut..Run time locked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ