Advertisementt

సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..

Fri 05th Jun 2020 12:58 PM
mahesh babu,sarkaru vaari paata,parashuram,mythri movie makers,14 reels plus,kiara advani,saiee manjrekar  సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..
Mahesh Sarkaru vaari paata Shooting will be start from. సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రకటన వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అనేక కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వల్ల సినిమా షూటింగులకి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో సర్కారు వారి పాట షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవనుందనే ప్రశ్న మొదలైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో స్టార్ట్ కానుందట.

అయితే మహేష్ బాబు మాత్రం అక్టోబరు నుండి షూటింగ్ లో పాల్గొంటాడట. కరోనా రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మహేష్ కొంచెం టైమ్ తీసుకోనున్నాడట. కానీ పరశురామ్ ఆగస్టు నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి, మహేష్ బాబు అవసరం లేని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేస్తాడట. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్లు వేయనున్నారట. మహేష్ చిత్రీకరణలో పాల్గొనే సమయానికి ఈ సెట్లు పూర్తవుతాయట.

మహేష్ బాబు డైరెక్ట్ సెట్లోనే దిగుతాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా, సాయి మంజ్రేకర్ పేర్లని పరిశీలిస్తున్నారు. మరి వీరిద్దరిలో మహేష్ సరసన నటించే అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు.

Mahesh Sarkaru vaari paata Shooting will be start from.:

Mahesh Sarkaru vaari paata Shooting will be start from.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ