పూరి జగన్నాధ్ - ఛార్మి కలిపి జాయింట్‌గా పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి.. దాని ద్వారా హీరోయిన్స్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు. అందులో కొంతమంది క్లిక్ అయితే మరికొంతమంది అడ్రస్ లేకుండా పోతున్నారు. అయితే గత ఏడాది రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాని చేసిన పూరి అండ్ ఛార్మి లు నిధి అగర్వాల్ - నభా నటేష్‌ని హీరోయిన్స్ గా ఫైనల్ చేసి హాట్ హాట్ గ్లామర్ గా వాళ్ళని చూపించి ఇస్మార్ట్ హిట్‌లో వారిని భాగం చేసారు. దానితో వారికీ బాగా క్రేజ్ వచ్చేసింది. ఇక ఛార్మి - పూరి.. పూరి కనెక్ట్స్ కి ఫిదా అయ్యి... నభా - నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ ద్వారా ఫేమస్ అవుదామని ఒప్పందం చేసుకున్నారట.
ఇస్మార్ట్ శంకర్ హిట్ కి ముందు నిధి కి కానీ, నభాకి కానీ పెద్ద హిట్స్ అయితే లేవు. ఇస్మార్ట్ హిట్ అందుకున్నాక పూరి కనెక్ట్స్‌లో జాయిన్ అయ్యి.. వారి ద్వారా అవకాశాలు అందిపుచ్చుకుందామని పూరి ఇంకా ఛార్మి లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే తాజాగా నభా, నిధి అగర్వాల్ లు ఇద్దరూ పూరి కనెక్ట్స్ నుండి బయటికొచ్చినట్టుగా ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. నిధి అగర్వాల్, రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న క్వీన్ తో ఒప్పందం చేసుకుందని... అలాగే నభా నటేష్ కూడా ఓ మేనేజర్ ని పెట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళకి మేనేజర్‌గా వ్యవహరించిన హరినాథ్ ద్వారా నభా అవకాశాలు వెతుక్కుంటుందట. మరి ఇస్మార్ట్ హిట్ తర్వాత నభా, నిధి కెరీర్ కానీ ఓ వెలుగు వెలగలేదు. చిన్న చిన్న అవకాశాలతోనే సర్దుకోవాల్సి రావడంతోనే నిధి, నభాలు ఇలా పూరికి, ఛార్మికి షాకిచ్చారని చెబుతున్నారు.