అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీస్‌లో తనకి తాజాగా నచ్చిన చిత్రం రణ్వీర్ సింగ్ నటించిన ‘గల్లీ బాయ్’ అని చెప్పాడు. నటిస్తే అలాంటి సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ అన్నాడు. ఆ సినిమాలో రణ్వీర్ సింగ్ నటన అద్భుతం అన్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా బన్నీ సినిమా రీమేక్ లో రణ్వీర్ సింగ్ నటించబోతున్నాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఈ ఏడాది జనవరిలో విడుదలైన బన్నీ అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం, ఆ సినిమా మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవడంతో.. ఆ చిత్ర బాలీవుడ్ రీమేక్ హక్కులు ఓ రేంజ్ లో అమ్ముడు పోయిన విషయం తెలిసిందే.
అయితే అల వైకుంఠపురములో సినిమా బాలీవుడ్ రీమేక్ లో సల్మాన్ నటించబోతున్నాడని అన్నారు. కానీ తాజాగా అల వైకుంఠపురములో రీమేక్ లో రణ్వీర్ సింగ్ నటించబోతున్నాడని.. మరికొంతమంది బాలీవుడ్ హీరోలు ఈ సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ.. ఈ చిత్ర హక్కులు భారీ రేటుకు కొన్న బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్ధే మాత్రం ఈ సినిమాని ఎలాగైనా క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ తో చేయాలని ముచ్చట పడుతున్నాడట. మరి ఈ సినిమాలోని సాంగ్స్‌కి బాలీవుడ్ అంతా డాన్స్ చేస్తుంది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.. క్రికెటర్స్ కూడా అల వైకుంఠపురములో పాటలకి డాన్స్ చేస్తూ సోషల్ మీడియాని దున్నేస్తున్నారు. అలాంటి రీమేక్ లో ఎనర్జిటిక్ హీరో రణ్వీర్ అయితే బావుంటుంది అని... అందుకే అశ్విన్... రణ్వీర్ సింగ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.