Advertisementt

తండ్రీ కొడుకులతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన దర్శకుడు..

Thu 04th Jun 2020 02:16 PM
vikram,dhruv,karthik subbaraj,vijay sethupathi  తండ్రీ కొడుకులతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన దర్శకుడు..
Director plan to do multistarrer with father and son.. తండ్రీ కొడుకులతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన దర్శకుడు..
Advertisement
Ads by CJ

విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా సినిమాతో దర్శకుడిగా మారిన కార్తిక్ సుబ్బరాజ్, ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. విభిన్నమైన కథాంశాలని ఎంచుకుని వైవిధ్యమైన కథనంతో తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా జగమే తంత్రం సినిమా చేస్తున్న కార్తిక్ సుబ్బరాజ్ చియాన్ విక్రమ్ హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

గత కొన్ని రోజులుగా విక్రమ్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. విలక్షణ పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడే విక్రమ్, ప్రస్తుతం జ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సెవెన్ స్టూడియోస్ నిర్మాణంలో సినిమా చేయనున్నాడట. ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా కనిపించనున్నాడని సమాచారం.

తెలుగులో సంచలన విజయం సాధ్జించిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో వెండితెరకి పరిచయమైన ధృవ్ విమర్శకుల ప్రశంసలని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ తండ్రీ కొడుకులనీ  ఒకే తెరపై చూపించడానికి కార్తిక్ సుబ్బరాజు రెడీ అవుతున్నాడన్న వార్త కొలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తే అభిమానులకి పండగే..

Director plan to do multistarrer with father and son..:

Director plan to do multistarrer with father and son..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ