Advertisementt

ఇంకా ఎందుకు ఈ దోబూచులాటలు.. కన్ఫర్మ్ చేసేయచ్చుగా..!

Thu 04th Jun 2020 01:48 PM
kgf,kgf 2,prashanth neel,ntr,mythri movie makers  ఇంకా ఎందుకు ఈ దోబూచులాటలు.. కన్ఫర్మ్ చేసేయచ్చుగా..!
Prashant neel movie with NTR .. ఇంకా ఎందుకు ఈ దోబూచులాటలు.. కన్ఫర్మ్ చేసేయచ్చుగా..!
Advertisement
Ads by CJ

కేజీఎఫ్ సినిమాతో అమితమైన క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కించనున్నాడనే సన్పెన్స్ కి తెరపడిందనే చెప్పవచ్చు. కన్నడ చిత్ర పరిశ్రమకి తప్ప మరొకరికి పరిచయమే లేని హీరోతో పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసి గూస్ బంప్స్ తెప్పించిన ప్రశాంత్ నీల్ కోసం మన టాలీవుడ్ నిర్మాతలు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుందని పరోక్షంగా హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజున బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రశాంత్ నీల్, న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చోవడానికి రెడియేషన్ సూట్ తో రెడీగా ఉంటానని ట్వీట్ చేసాడు. అయితే దీనికి కొనసాగింపుగా మైత్రీ మూవే మేకర్స్ ట్వీట్ చేసి మరింత ఆసక్తిని కలిగించింది.

నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ రెడియేషన్ సూట్ తో రెడీగా ఉండమని చెప్పింది. అంటే గతంలో వచ్చిన వార్తల ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసినట్టే. అయితే ఆ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా దోబూచులాడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

ఆల్రెడీ అటు డైరెక్టర్ నుండి, ఇటు ప్రొడ్యూసర్ నుండి పరోక్షంగా సంకేతాలు వచ్చేసాయి. మరి ఎన్టీఆర్ నుండి కూడా ఇలాంటి పరోక్ష సంకేతాలు వస్తాయా లేదా డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేస్తారా అన్నది చూడాలి.

Prashant neel movie with NTR ..:

Prashant neel movie with NTR ..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ