Advertisementt

ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన హీరోయిన్...

Thu 04th Jun 2020 01:32 PM
rashmika mandanna,pooja hegde,telugu,telugu film industry  ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన హీరోయిన్...
Rashmika Mandannas five years photo on Magazine cover ఐదేళ్లకే మ్యాగజైన్ పై మెరిసిన హీరోయిన్...
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. పూజా హెగ్డేతో పోటీ పడుతూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తుంది. ఛలో సినిమాతో తెలుగు తెరకి పరిచయమై గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరుమ్ భీష్మ వంటి హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది.

వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ మధ్య అభిమానులతో ముచ్చటిస్తూ తనని ఎలాంటి సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారో చెప్పండని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. రష్మిక ఐదేళ్ళున్నప్పుడు ఒక మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన ఫోటోని షేర్ చేసింది.

గోకులం అనే మ్యాగజైన్ కోసం 2001లో దిగిన ఫోటో అని చెబుతూ, ఈ ఫోటోని మా అమ్మ దాచుకుందని, అదొక్కటే కాదు ఇప్పటికీ మ్యాగజైన్ కవర్ పేజీలపై వచ్చే ప్రతీ ఫోటోని దాచుకుంటుందంటూ చెప్పింది.

Rashmika Mandannas five years photo on Magazine cover:

Rashmika Mandannas five years photo on Magazine cover

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ