Advertisementt

కార్తికేయ 2 నుండి అనుపమ బయటకి వచ్చేసిందా..?

Thu 04th Jun 2020 12:48 PM
anupama parameshwaran,nikhil,chandu mondeti  కార్తికేయ 2 నుండి అనుపమ బయటకి వచ్చేసిందా..?
Is Anupama out from the Nikhils Karthikeya 2 కార్తికేయ 2 నుండి అనుపమ బయటకి వచ్చేసిందా..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, కార్తికేయ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. చందు మొండేటి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లో చెప్పుకోదగ్గ విజయంగా నిలిచింది. దాంతో చందూ మొండేటి కార్తికేయ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్నాడు. కార్తికేయ 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్  నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

కార్తికేయ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి మెరిసిన సంగతి తెలిసిందే.  పెళ్ళి తర్వాత కలర్స్ స్వాతి సినిమాలకి దూరమైంది. దాంతో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అయితే బాగుంటుందని చందూ భావించాడట. స్క్రిప్టు కూడా వినిపించాడని టాక్. అయితే అంతా విన్న తర్వాత అనుపమ ఈ సినిమాలో చేయనని చెప్పిందని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్రని ఏమాత్రం ఇంపార్టెన్స్ లేకపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు.

ప్రస్తుతానికి కార్తికేయ 2 చిత్రబృందం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారట. ఇటీవల పెళ్ళి చేసుకున్న నిఖిల్ కార్తికేయ 2 సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు. అదీగాక దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రం విజయం సాధించడం చాలా అవసరం. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్ల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్- చందూల కాంబినేషన్లో మరోమారు అద్భుతం జరగనుందని అనుకుంటున్నారు.

Is Anupama out from the Nikhils Karthikeya 2:

Anupama out from Karthikeya 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ