Advertisementt

‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క‌ లుక్!

Fri 05th Jun 2020 08:48 AM
virataparvam,priyamani,birthday special,look released  ‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క‌ లుక్!
Actress Priyamani Look Released From Virataparvam ‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క‌ లుక్!
Advertisement
Ads by CJ

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్న‌ ‘విరాట‌ప‌ర్వం’ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో నటిస్తున్న ప్రియ‌మ‌ణి నేడు (జూన్ 4) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ‘విరాట‌ప‌ర్వం’లో ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో బ్లాక్ డ్ర‌స్‌లో అడ‌వి అందాల్ని ఆస్వాదిస్తున్న‌ట్లు స్వ‌చ్ఛంగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు ప్రియ‌మ‌ణి. విప్ల‌వ నాయ‌కురాలు కామ్రేడ్ భార‌త‌క్క పాత్ర‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్న‌ట్లు ఆమె క‌నిపిస్తున్నారు.

“మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం” అని ఆమె పాత్ర ప్రాముఖ్యం గురించి చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ట్వీట్ చేశారు. వివాహానంత‌రం న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియ‌మ‌ణి పాత్ర‌ల ఎంపిక‌లో సెల‌క్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే చేస్తూ వ‌స్తున్నారు. అదే త‌ర‌హాలో ‘విరాట‌ప‌ర్వం’లో త‌ను చేస్తున్న పాత్ర‌ను ప్రేమించ‌డం వ‌ల్లే దాన్ని చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని ఆమె చెప్పారు.

‘విరాట‌ప‌ర్వం’ అనేది కంటెంట్ మీద ఆధార‌ప‌డిన ఒక యూనిక్ ఫిల్మ్‌. ఇందులోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా ఇదివ‌ర‌కు తామెన్న‌డూ చేయ‌ని పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొద్దిపాటి షూటింగ్ మిన‌హా సినిమా అంతా పూర్త‌యింది. తొలి చిత్రం ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తోటే ప్ర‌తిభావంతుడైన డైరెక్ట‌ర్‌గా అంద‌రి ప్ర‌శంస‌లూ పొందిన వేణు ఊడుగుల ‘విరాట‌ప‌ర్వం’ను తీర్చిదిద్దుతుండ‌గా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ అధినేత‌లు డి. సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

తారాగ‌ణం:

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీరావు, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక బృందం:

మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్ర‌ఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి

ఎడిటింగ్‌: ఎ. శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శ్రీ‌నాగేంద్ర‌

స్టంట్స్‌: స‌్టీఫెన్ రిచ‌ర్డ్‌

కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం

ప‌బ్లిసిటీ డిజైన్స్‌: ధ‌ని ఏలే

పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  విజ‌య్‌కుమార్ చాగంటి

స‌మ‌ర్ప‌ణ‌: డి. సురేష్ బాబు

నిర్మాత‌:  సుధాక‌ర్ చెరుకూరి

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌

బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌

Actress Priyamani Look Released From Virataparvam :

Actress Priyamani who played a key role in Rana Daggubati and Sai Pallavi starrer Virataparvam celebrates her birthday today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ