Advertisementt

బాలయ్యకు చిరంజీవి ఫోన్ చేశారా..!?

Thu 04th Jun 2020 06:11 PM
chiru phone call to balayya,megastar chiranjeevi,nandamuri balayya,tollywood  బాలయ్యకు చిరంజీవి ఫోన్ చేశారా..!?
Chiru Phone Call To Balayya.. Is It True!? బాలయ్యకు చిరంజీవి ఫోన్ చేశారా..!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్‌లతో సినీ పెద్దల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పలువురు ప్రముఖులు స్పందించడం.. ఆ తర్వాత బాలయ్య కూడా ఓ యూ ట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ ఈ వ్యవహారంపై స్పందించడం తెలిసిన విషయమే. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు అటు బాలయ్యతో.. ఇటు చిరంజీవితో మాట్లాడారట. ఇద్దర్నీ ఏకం చేయడానికి భగీరథ ప్రయత్నాలు చేసి చివరికి సక్సెస్ అయ్యారట. 

అండర్ స్టాండింగ్ కుదిరినట్లేనా!?

ఓ పెద్ద మనిషి దగ్గరుండి మరీ చిరు ఫోన్‌తోనే బాలయ్యకు ఫోన్ చేపించారట. అలా బాలయ్య.. మెగాస్టార్ ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారని టాక్ నడుస్తోంది. టైమ్ వచ్చినప్పుడు.. అందరం కలవాల్సి వచ్చినప్పుడు కలుద్దామని కూడా చిరు చెప్పారట. అబ్బే.. తాను అవేం పట్టించుకోనని బాలయ్య కూడా చెప్పారట. అందుకే దీనిపై కొన్నిరోజులుగా అటు మెగా కాంపౌండ్ నుంచి కానీ.. ఇటు నందమూరి కాంపౌండ్ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ లేవట. సో.. మొత్తానికి చూస్తే అటు బాలయ్య-చిరు ఓ అండర్ స్టాండింగ్‌కు వచ్చేశారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్న మాట.

నోరు పారేసుకోకు..!

అంతేకాదు.. నాగబాబుకు కూడా నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని.. ఎదుటి వ్యక్తి ఏదో మాట్లాడితే అది ఆయన విజ్ఞతకే వదిలేయాలే కానీ మనం రియాక్టయ్యి మాట్లాడటం వల్ల నోరు పాడవుతుందని చిరు చెప్పాడట. ఇక మీదట ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అస్సలు రియాక్ట్ కావాల్సిన అక్కర్లేదని కూడా గట్టిగా ఒకింత హెచ్చరించినట్లుగా చిరు చెప్పాడని టాక్ నడుస్తోంది. మరోవైపు అస్తమాను నోరు పారేసుకోకుండా ఇటు నాగబాబుకు కూడా ఒకింత హెచ్చరించారన్న మాట. ఈ వ్యవహారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లే.!

Chiru Phone Call To Balayya.. Is It True!?:

Chiru Phone Call To Balayya.. Is It True!?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ