Advertisementt

మొన్న బన్నీ.. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో..!

Thu 04th Jun 2020 12:46 PM
interesting news,prabhas movie,pooja hegde,prabhas and jairam,ala vaikuntapuramlo,prabhas latest movie  మొన్న బన్నీ.. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో..!
Interesting News About Prabhas Movie! మొన్న బన్నీ.. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో..!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ చిత్రంతో సరికొత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కాగా లాక్ డౌన్ మొదలుకుని ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. చాలా రోజులుగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. అయితే తాజాగా.. ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది.

అదేమిటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ సీనియర్ హీరోయిన్ టబుకు భర్తగా నటించిన ప్రముఖ నటుడు జైరాం.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడట. అది కూడా కీలక పాత్ర కావడంతో ఆయన ఒప్పుకున్నాడని టాక్ నడుస్తోంది. అంటే.. అప్పుడు బన్నీ సినిమాలో ఇప్పుడు డార్లింగ్ సినిమాలో జైరాం నటిస్తున్నాడటన్న మాట. ఇటీవలే జైరామ్‌ను దర్శకనిర్మాతలు సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 

కాగా.. తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో జైరాం నటించి మెప్పించిన విషయం విదితమే. బన్నీ ‘అల’లో ఆయన చుట్టే సినిమా నడిచిన విషయం విదితమే. అయితే ప్రభాస్ సినిమాలో ఎలాంటి పాత్ర ఉంటుంది.. అనేదానిపై ప్రభాస్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Interesting News About Prabhas Movie!:

Interesting News About Prabhas Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ