మహేష్‌తో మహర్షి సినిమా చేసిన దగ్గరనుండి వంశీ పైడిపల్లి, మహేష్‌తో మరో సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాడు. అయితే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత నీతోనే అంటూ ఊరించి వదిలేశాడు. అయితే కథ పక్కాగా సిద్ధం చెయ్యి నీతో సినిమా ఉంటుంది అంటున్నాడే కానీ.. కమిట్మెంట్ ఇవ్వకుండానే పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమా మొదలెట్టాడు. ఇక దీని తర్వాత రాజమౌళి సినిమా అంటున్నాడు. మరోపక్క పూరి కథ కోసం వెయిటింగ్ అంటున్నాడు. అయితే తాజాగా వంశీ ఇక మహేష్ కోసం వెయిట్ చేసినా వేస్ట్ అనుకున్నాడో.. లేదా మహేష్ కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు.... మహేష్ పిలిచేవరకు ఈ పని చేద్దామనుకున్నాడో కానీ.. వంశీ ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడట.
అదేమంటే ప్రస్తుతం డిజిటల్ ఫార్మెట్స్‌లో వెబ్ సిరీస్ ల హవా భీభత్సంగా కొనసాగుతుంది. క్రిష్ లాంటి డైరెక్టర్స్ కూడా ఈ వెబ్ సీరీస్‌లపై కూర్చుంటున్నారు. ఇప్పటికే క్రిష్ ఆహా కోసం వెబ్ సీరీస్ చేస్తున్నాడు. తాజాగా వంశీ పైడిపల్లి కూడా ఓటీటీ వైపు దృష్టి సారించాడు.. త్వరలోనే ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడట వంశీ. అందుకు సంబంధించిన సన్నాహాలు సాగుతున్నాయని.. ఓ వెబ్ సీరీస్ కి దర్శకుడిగా, మరో వెబ్ సీరీస్ కి నిర్మాతగా వంశీ ఆహా కోసం పనిచెయ్యబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మరి ఇప్పటికే ఆహా టీం తో వంశీ పైడిపల్లి చర్చలు జరిపి ఓ నిర్ణయానికి కూడా వచ్చేసాడట.