యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. మహానటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో సినిమా ఉంటుందనీ, సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుందని, ప్రభాస్ దేవకన్య కొడుకుగా అతీత శక్తులున్న వాడిగా కనిపిస్తాడని పలురకాల వార్తలు వచ్చాయి.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిమ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో దేవుడు, దేవుడి మహిమలు అనే కాన్సెప్ట్ ఉందట. ఈ జోనర్ లో తెలుగులో సినిమాలు వచ్చి చాలా రోజులవుతుంది. అయితే దేవుడి గురించిన అంశాలు సినిమాలో ఉన్నా కూడా వాటిమీదే ఫోకస్ చేయకుండా అంతర్లీనంగా టచ్ అవుతుందని అంటున్నారు. దేవుడికి, సైన్స్ కి మధ్యలో జరిగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఉండనుందని ప్రచారం జరుగుతుంది.
సాధారణంగా ఇలాంటి అంశాలు ప్రతీ ఒక్కరికీ ఆసక్తిని కలిగిస్తాయి. మరి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవుడి అంశాన్ని ఏ విధంగా చూపిస్తాడో చూడాలి.