Advertisementt

తన సినిమా కెరీర్ ఎలా ఉండాలో చెప్పమంటున్న రష్మిక...

Wed 03rd Jun 2020 09:58 AM
rashmika mandanna,allu arjun,pushpa,sukumar,devi sri prasad,mahesh babu  తన సినిమా కెరీర్ ఎలా ఉండాలో చెప్పమంటున్న రష్మిక...
Rashmika asked to fans for movie career.. తన సినిమా కెరీర్ ఎలా ఉండాలో చెప్పమంటున్న రష్మిక...
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్లలో రష్మిక మందన్న ఒకరు. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై గీత గోవిందం సినిమాతో సాలిడ్ హింట్ అందుకుని, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతుండడంతో లక్కీ గర్ల్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మళయాల భాషల్లో రిలీజ్ కానుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. దాంతో సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటున్న రష్మిక వారి నుండి సలహాలు కూడా అడుగుతుంది. సాధారణంగా హీరోయిన్లు అభిమానులు అడిగిన ప్రశ్నలకి మాత్రమే జవాబులు ఇస్తుంటారు.

కానీ ఇందుకు విరుద్ధంగా రష్మిక, తన సినిమా భవిష్యత్ ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారో రిప్లై ఇవ్వమని కోరింది. తానెలాంటి సినిమాల్లో నటిస్తే అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతారో చెప్పమని ట్విట్టర్ వేదికగా కోరింది. సాధారణంగానే మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాం.. అలా చూడాలనుకుంటున్నాం అని అడక్కుండానే చెప్పే అభిమానులు రష్మిక అడిగిన దానికి రెట్టింపు ఉత్సాహంతో స్పందిస్తూ తమకి నచ్చిన సలహాలని ఇస్తున్నారు.

Rashmika asked to fans for movie career..:

Rashmika asked to fans about cinema career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ