Advertisementt

అనిల్ రావిపూడి మరో కథ సిద్ధం చేసుకోవాల్సిందేనా..?

Tue 02nd Jun 2020 02:26 PM
anil ravipudi,venkatesh,varun tej,mahesh babu   అనిల్ రావిపూడి మరో కథ సిద్ధం చేసుకోవాల్సిందేనా..?
Anil Ravipudi should prepare another script..? అనిల్ రావిపూడి మరో కథ సిద్ధం చేసుకోవాల్సిందేనా..?
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాగా ఎఫ్ 3ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. అందుకోసం లాక్డౌన్ లో సొంతఊరు వెళ్ళి మరీ ఎఫ్ 3 స్క్రిప్టు పనులని పూర్తి చేశాడు. గత సంవత్సరం నుండి సంక్రాంతి కానుకగా సినిమాలని రిలీజ్ చేస్తూ బ్లాక్ బస్టర్లని అందుకుంటున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి ఎఫ్ 3 సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ వేసాడు.

కానీ కరోనా వల్ల ఆ ప్లాన్ లన్నీ తారుమారయ్యాయి. లాక్డౌన్ టైమ్ స్క్రిప్ట్ రాయడానికి బాగానే పనికి వచ్చింది. కానీ ఎఫ్ 3 సినిమా కోసం వెంకటేష్ తో పాటు వరుణ్ ల డేట్స్ కూడా కావాలి. ప్రస్తుతం అదే అనిల్ కి సమస్యగా మారింది. ఇటు వెంకటేష్ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా పనుల్లో ఉన్నాడు. సో ఇప్పుడప్పుడే వీళ్ళిద్దరూ దొరికే అవకాశం లేదు. 

అదీగాక వెంకటేష్, హడావిడిగా షూటింగ్ తీయడం వద్దనీ, ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని కంగారుగా చిత్రీకరణ పూర్తి చేయడం కంటే అన్నీ కుదురుకునే వరకూ ఆగుదామని అంటున్నాడట. అంటే ఎఫ్ 3 పట్టాలెక్కేది ఇక వచ్చే సంవత్సరమే అని తెలుస్తుంది. సో అనిల్ అప్పటి దాకా వెయిట్ చేయాల్సిందే. మరి ఈ టైంలో అనిల్ మరో సినిమా ప్లాన్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

Anil Ravipudi should prepare another script..?:

Anil Ravipudi should prepare another script

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ