Advertisementt

సర్కారు వారి పాటలో హీరోయిన్ ఛాన్స్ ఆమెకే..?

Tue 02nd Jun 2020 02:08 PM
kiara adwani,mahesh babu,svp,sarkaru vaari paata,parashuram  సర్కారు వారి పాటలో హీరోయిన్ ఛాన్స్ ఆమెకే..?
Heroine chance for Mahesh Sarkaru vaari Paata సర్కారు వారి పాటలో హీరోయిన్ ఛాన్స్ ఆమెకే..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రకటన వచ్చినప్పటి నుండి సోషల్ మీడీయాలో రచ్చ రచ్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమా అప్డేట్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులు ప్రకటన వెలువడినప్పటి నుండి చాలా ఉత్సాహంగా ఉన్నారు. టైటిల్ తో పాటు, చెవికి పోగు, మెడమీద టాటూ తో ఫస్ట్ లుక్ చాలా ఆసక్తిగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, జీఎమ్ బీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి హీరోయిన్ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

భరత్ అనే నేను సినిమాలో మహేష్ తో జతకట్టిన కియారా అద్వానీ అయితే బాగుంటుందని పరశురామ్ అనుకుంటున్నాడట. ఈ మేరకు కియారాతో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. అయితే కబీర్ సింగ్ విజయంతో బాలీవుడ్ లో బిజీగా మారిన కియారా ఈ సినిమాలో నటిస్తుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. అయితే తెలుగులో మంచి ఆఫర్ వస్తే నటిస్తానని చెప్పిన కియారా మహేష్ సర్కారు వారి పాటలో నటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కియారా హీరోయిన్ గా ఓకే అయితే హిట్ కాంబినేషన్ రిపీట్ అయినట్టే.

Heroine chance for Mahesh Sarkaru vaari Paata:

Kiara would be the heroine in SVP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ