Advertisementt

కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో..?

Tue 02nd Jun 2020 02:47 PM
koratala siva,director,confusion,next hero,acharya,ram charan,chiranjeevi  కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో..?
Who is Koratala Siva next Hero? కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో..?
Advertisement
Ads by CJ

కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలయ్యాక చాలా గ్యాప్ తో మెగా క్యాంప్‌లోకి అడుగుపెట్టాడు. రామ్ చరణ్ అనుకుంటే చిరు తగలడంతో చిరు కోసం ‘ఆచార్య’ కథ రాసుకుని సైరా షూట్ అయ్యేవరకు వెయిట్ చేసి ఎట్టకేలకు చిరుతో ఆచార్యని పట్టాలెక్కించాడు. అదనపు హంగుల కోసమా అని రామ్ చరణ్ కి ఓ పాత్రని రాసుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కొరటాల ఆశల మీద నీళ్లు చల్లేసింది. RRR అయ్యేవరకు రామ్ చరణ్ ఆచార్య కోసం రాలేడు. మహేష్ మాటిచ్చాడు కానీ.. మాట ఇచ్చాడు కదా అని ఓ చిన్న పాత్రకి మహేష్ ని తీసుకురాలేడు. మరోపక్క రెండేళ్లుగా ఆచార్య మీదే వర్క్ చేస్తున్నాడు.

ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కంప్లీట్ చెయ్యడం అసాధ్యం. మళ్ళీ ఏప్రిల్ వరకు వెయిట్ చెయ్యాలి. ఈలోపు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ లు ఎవరికీ వారే ఇతర సినిమాలతో బిజీ అయితే కొరటాలకు స్టార్ హీరోలు దొరికే ఛాన్స్ ఉండదు. మెగా క్యాంప్ లోనే ఏదో ఒక హీరోతో అడ్జెస్ట్ అవ్వాలి. అందుకే కొరటాల ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నాడట. ఆచార్య ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా అని ఎదురు చూస్తుంటే.. కరోనా లాక్ డౌన్ మాత్రం పొడిగించుకుంటూ పోతున్నారు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవ్వాలి.. ఎప్పుడు ఆచార్య పూర్తి కావాలి.. ఎప్పుడు మరో సినిమా కోసం హీరోని వెతకాలి అంటూ కొరటాల ఇప్పటినుండే ఆలోచన చేసున్నాడట. మరి చాలామంది డైరెక్టర్స్ ఓ సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమాని ఓకే చేయించేసుకుంటున్నారు. ఇప్పుడు కొరటాల బాధ కూడా అదే కదా. 

Who is Koratala Siva next Hero?:

Director Koratala siva in Confusion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ