Advertisementt

‘గుండ‌మ్మ క‌థ’ ట్రైల‌ర్ వదిలారు

Mon 01st Jun 2020 06:33 PM
gundamma katha 2020,gundamma katha 2020 movie trailer,gundamma katha trailer,lakshmi srivastava,krishnam raju,aditya movies  ‘గుండ‌మ్మ క‌థ’ ట్రైల‌ర్ వదిలారు
Gundamma Katha 2020 Movie Trailer Release ‘గుండ‌మ్మ క‌థ’ ట్రైల‌ర్ వదిలారు
Advertisement
Ads by CJ

పూర్తివినోదాత్మ‌కంగా రూపొందిన ఆదిత్య క్రియేషన్స్ వారి ‘గుండ‌మ్మ క‌థ’ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆదిత్య క్రియేష‌న్స్‌ ప‌తాకంపై ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్వీయ నిర్మాణంలో కృష్ణంరాజు ద‌ర్శ‌కునిగా తెర‌కెక్కిన సినిమా ‘గుండ‌మ్మ క‌థ’‌. ఈ చిత్రంతో ఆదిత్య, ప్ర‌ణ‌వ్య హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విధంగా హోల్స‌మ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతగా ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ ఓ వైపున‌ నిర్మాణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే మ‌రోవైపున స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌డం విశేషం. అంతేకాకుండా కృష్ణంరాజుతో క‌లిసి ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌లు కూడా నిర్వ‌హించారు. అల‌‌నాటి గుండ‌మ్మ క‌థ ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈత‌రం ఆడియెన్స్ కి క‌నెక్ట్ అయ్యే రీతిన ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల‌తో కూడా స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌న‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. గ‌తంలో విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో అదే ఉత్స‌ాహంతో తాజాగా గుండ‌మ్మ క‌థ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. అలానే క‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ద‌ర్శ‌కులు లక్ష్మీ శ్రీవాత్స‌వ, కృష్ణంరాజులు మాట్లాడుతూ.. అలనాటి గుండ‌మ్మ క‌థ త‌ర‌త‌రాలు తెలుగు సినీ ప్రేక్ష‌కుల్ని ఏ రీతిన అల‌రిస్తుందో అదే స్ఫూర్తితో అన్ని వ‌ర్గాల తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విధంగా ఈ మోడ్ర‌న్ గుండ‌మ్మ క‌థ‌ని రెడీ చేశాము. ఈ సినిమాలో ఆదిత్య హీరోగా, ప్ర‌ణ‌వ్య హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో జ‌బ‌ర్థ‌స్త్ ఫేమ్ గెటప్ శ్రీను కామెడీ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తోంద‌ని, ఫ్యామిలీతో హాయిగా చూసే సినిమాగా గుండ‌మ్మ క‌థ ఉండ‌బోతుంది అని అన్నారు. క‌రోనా కార‌ణంగా ఏర్ప‌డిన థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ తెలిపారు.

Click Here for Trailer

న‌టీ న‌టులు - ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌, గెటప్ శ్రీను, భాష త‌దిత‌రులు

టెక్నీషియ‌న్లు

కెమెరా - మోనీష్ భూప‌తి

ఎడిట‌ర్ - ప్ర‌వీణ్ పూడి

మ్యూజిక్ - స‌తీష్ సాధ‌న్‌

క‌థ‌, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌

నిర్మాత - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌

ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ‌, కృష్ణం రాజు

బ్యాన‌ర్ - ఆదిత్య మూవీస్

Gundamma Katha 2020 Movie Trailer Release:

Gundamma Katha 2020 Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ