దక్షిణాది హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన వ్యక్తిగత జీవితంలోని వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అవకాశాలని అందిపుచ్చుకుంటూ టాప్ లో కొనసాగుతుంది. అయితే కెరీర్ పరంగా ఆమె జీవితం సాఫీగానే సాగుతోంది. ఇక వ్యక్తిగతంగానూ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు.
దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న నయన తార త్వరలో పెళ్ళి చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ మొదలై ఎన్నో రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పెళ్ళిపై స్పందించలేదు. పెళ్లెప్పుడు అని అడిగిన ప్రతీసారీ మరికొద్ది రోజుల్లో ఉంటుందని చెప్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న రూమర్ ప్రకారం మరికొద్ది రోజుల్లో వీరిద్దరి పెళ్లి జరగబోతుందని అంటున్నారు.
విఘ్నేష్ శివన్ ఇంట్లో పెళ్ళి చేసుకోమ్మని ఒత్తిడి చేస్తున్నారట. నయనతారకి అలాంటి ప్రాబ్లెమ్ లేకపోయినప్పటికీ, బోయ్ ఫ్రెండ్ ఇంట్లో ఒత్తిడి కారణంగా త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ నయనతార పెళ్ళిపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటీ నిజం కాలేదు. మరి ఈ సారి వస్తున్నా వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.