లాక్ డౌన్ కారణంగా హీరోయిన్స్ మొత్తం హోమ్ కే పరిమితమయ్యారు. ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఆనందంలో తేలిపోతున్నారు. అయితే రష్మిక కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యడం ఆనందంగా ఉందని అంటుంది. అంతేకాకుండా రష్మిక కి 18 ఏళ్ళ వయసు నుండే కాలంతో పరిగెడుతూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఓ గమ్యం చేరుకోగానే మరో ప్రయాణం మొదలవుతుంది అని.. ఇలాంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. అలా పరిగెత్తడం చాలా ఇష్టం అని అంటుంది.
నిజం చెప్పాలంటే ఇంతగా అంటే గత రెండు నెలలుగా ఇంట్లో గడపడం ఇదే మొదటిసారని.. స్కూల్, కాలేజ్ లైఫ్ అంతా హాస్టల్ లోనే గడిచిపోయింది అని.. ఇక సినిమాల్లోకి వచ్చాక షూటింగ్స్ తో ఎప్పుడు బిజీనే అని.. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను రెబల్ అని అందుకే నన్ను కంట్రోల్ చెయ్యడానికి ఫ్యామిలీ మెంబెర్స్ ట్రై చేసేవారని తెలిపింది. ఇక సినిమాల్లోకి వచ్చాక నా అల్లరి తగ్గిపోయి అమ్మ షూటింగ్స్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఆఫీస్ పని పూర్తిచేసుకుని మాతో టైం గడపడానికి నాన్న త్వరగా రావడమంటే ఇష్టమంటుంది రష్మిక. ఇక చెల్లి ఎప్పుడు వాగుతూనే ఉండేదని.. మళ్లీ లాక్ డౌన్ వలన ఆ రోజులు గుర్తొస్తున్నాయి అంటుంది ఈ పాప. ఇక ఎప్పుడూ షూటింగ్స్, కొత్త కథలు అనకుండా అమ్మ వాళ్లతో హ్యాపీగా గడుపుతున్నాను అంటుంది రష్మిక.