Advertisementt

సర్కారు వారి పాటలో ఆ రూమర్ నిజమేనా..?

Sun 31st May 2020 03:10 PM
ssmb27,mahesh babu,parashuram,mythri movie makers  సర్కారు వారి పాటలో ఆ రూమర్ నిజమేనా..?
Is that rumour is real for Maheshs Sarkaru Vaari Paata..? సర్కారు వారి పాటలో ఆ రూమర్ నిజమేనా..?
Advertisement
Ads by CJ

మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ సినిమా గురించి అప్డేట్ వచ్చింది. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే టైటిల్ తో చిత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేసి అనేక సందేహాలకి తెర దించారు. అయితే కొత్త సందేహాలకి తెర లేపారని కూడా చెప్పుకోవాలి. స్టార్ హీరో సినిమా అంటే రకరకాల ఊహాగానాలు, పుకార్లు, గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి.

ప్రస్తుతం అలాంటి పుకార్లు సోషల్ మీడియా వేదికగా సర్కారు వారి పాట గురించి వస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తుంటే మహేష్ చాలా యంగ్ గా కనిపించనున్నట్లు అర్థం అవుతుంది. చెవికి రింగు, మెడ మీద రూపాయి నాణెం టాటూ, స్టైలిష్ హెయిర్ స్టైల్ చూస్తుంటే మహేష్ బాబుని సరికొత్తగా చూడబోతున్నామని తెలుస్తుంది. అయితే ఇదే ఇప్పుడు రూమర్లకి ఆయువు పోసింది.

సర్కారు వారి పాటలో మహేష్ మూడు గెటప్స్ లో కనిపించనున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే అవి నిజమేమో అని ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తే అనుమానం వేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోల్లో కూడా చాలా యంగ్ గా కనిపించారు. సినిమా కోసమే మహేష్ ఈ లుక్ లోకి మారాడని, సినిమాలో ఖచ్చితంగా మూడు గెటప్స్ లో దర్శనమివ్వబోతునాడని చెబుతున్నారు. సినిమాపై మరిన్ని అప్డేట్స్ వస్తేగానీ ఈ పుకార్లు నిజమా కాదా అన్నది చెప్పలేం..

Is that rumour is real for Maheshs Sarkaru Vaari Paata..?:

Is that rumour is real for Maheshs Sarkaru Vaari Paata..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ