టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప సినిమాకి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. అల్లు అర్జున్ కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన సుకుమార్ కి కరోనా రూపంలో పెద్ద షాక్ తగిలింది. లొకేషన్స్ అన్నీ చూసుకుని పక్కాగా ప్లాన్ చేసుకుని విదేశీ సాంకేతిక నిపుణులతో యాక్షన్ సీక్వెన్సెస్ తీర్చిదిద్దుదామని ప్లాన్లు వేసుకుంటే లాక్డౌన్ కారణంగా ఆ ప్లాన్లన్నీ మారిపోయాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎక్కువభాగం అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోవాలి. అందుకోసం ఆల్రెడీ లొకేషన్స్ కూడా చూసుకున్నారు. కేరళలోని ఆకుపచ్చని అడవుల్లో కొంత భాగం షూట్ చేయాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల వలన అక్కడి ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చేలా కనబడట్లేదు. దాంతో షూటింగ్ లొకేషన్స్ ని మార్చాలని డిసైడ్ అయ్యారట.
కేరళ నుండి ఆంధ్రపదేశ్ అడవుల్లోకి మార్చారని అంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి సానుకూలంగానే స్పందించింది. అదీగాక తెలంగాణలో కూడా ఈ నెల 15వ తేదీ నుండి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయని అంటున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా చిత్రీకరణకి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.