మొన్నామధ్యన నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన దీపికా పడుకొనే ని దర్శకుడు నాగ్ అశ్విన్ సంప్రదిస్తున్నాడనే టాక్ నడిచింది. అయితే తాజాగా దీపికా పదుకునే వాలకం చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా దీపికా ‘మహానటి’ సినిమాని చూసి మనసు పారేసుకుంది. లాక్ డౌన్ లో భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి ముంబై లోని తన ఇంట్లో సేద తీరుతున్న దీపికా పదుకొనే వంటలతోను, వర్కౌట్స్ తోనూ బిజీ బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాని వీక్షించినట్లుగా ఉంది.
తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన మహానటి సినిమా చూసిన దీపికా పదుకొనే మహానటి పోస్టర్ ని షేర్ చేస్తూ మహానటి ని వెంటనే చూడండి అంటూ ట్వీట్ చేసింది.దానితో దర్శకుడు నాగ్ అశ్విన్ తెల్లవారు జామున కూల్ నోటిఫికేషన్ తో నిద్ర లేచాను అంటూ రీ ట్వీట్ చేసాడు. మరి దీపికా పదుకొనే మహానటి ని చూసింది అంటే నాగ్ అశ్విన్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అనేది చూడడానికేనా? నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా కోసం దీపికాని సంప్రదించడం.. నాగ్ అశ్విన్ చూడమంటేనే మహానటిని దీపికా చూసిందా? లేదంటే ఇలా తెలుగు మూవీని దీపికా చూస్తుందా? అంటూ అనేకరకాల అనుమానాలతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు సతమతమవుతున్నారు. ప్రభాస్ ఫాన్స్ మాత్రం దీపికా మా ప్రభాస్ పక్కన నటించడం ఖాయం అందుకే ఇలా అంటూ ఫిక్స్ అవుతున్నారు.