Advertisementt

రష్మిక డ్యాన్స్‌‌పై సమంత కామెంట్స్ ఇవే!

Sun 31st May 2020 03:25 PM
samantha,live,chit chat,rashmika mandanna,dance,heroine  రష్మిక డ్యాన్స్‌‌పై సమంత కామెంట్స్ ఇవే!
Heroine Samantha talks about Rashmika Dance రష్మిక డ్యాన్స్‌‌పై సమంత కామెంట్స్ ఇవే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఈ ఏడాది లక్కీ హీరోయిన్ ఎవరయ్యా అంటే రష్మిక పేరే చెబుతారు. ఎందుకంటే ఈ ఏడాది మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ’లతో సూపర్ హిట్స్ కొట్టిన రష్మికని ఇప్పుడు మరో హీరోయిన్ మోసేస్తుంది. తెలుగులో ఆఫర్స్ వచ్చినా.. నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటున్న క్రేజీ హీరోయిన్ సమంత.. రష్మిక డాన్స్ అంటే ఇష్టమని, ఇంకా రష్మిక కష్టపడే మనస్తత్వం నచ్చుతుంది అని చెబుతుంది. తాజాగా సోషల్ మీడియా లైవ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత.. చైతు అంటే ఒక్క పదంలో చెప్పమనగానే సంతోషం అని చెప్పిన సమంత.. అక్కినేని అమల అంటే ఫ్రెండ్ అని, ఆమెని మార్గదర్శకంగా భావిస్తా అని చెబుతుంది. ఇక లాక్ డౌన్ సమయంలో ఇంటి టెర్రస్ పైన ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నా అని చెప్పిన సమంత, చైతు కి ఇష్టమైన వంటలు చేసి పెడుతుందట.

మరో అభిమాని.. సమంతను నిన్ను ద్వేషించే వారి పట్ల నువ్వు ఎలా ఉంటావని అడిగితే సమంత చెప్పిన సమాధానం వింటే షాకవ్వాల్సిందే. ద్వేషించే వారు మరియు విమర్శకులు చేసే వారిని చూస్తే ఇంకా బాగా నటించాలనే కసిని పెంచుతారట. అయితే సమంత సూపర్, అదుర్స్ అనే పొగడ్తలు తనను బద్ధకస్థురాలిగా మారుస్తాయట. కాబట్టి హేటర్స్ ఆవిధంగా తనకు మేలే చేస్తున్నట్లు అని సమంత చెప్పింది. అలాగే జిమ్‌లో నువ్వు ఎక్కువగా కష్టపడతావా? లేక చైతూనా? అని అడగగా.. చైతూనే అని సమాధానం చెప్పింది. ఇక సెలెబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కష్టముగా అనిపించేది మాత్రం నీ గురించి నిజం కానీ విషయాలను విన్నప్పుడు బాధ కలుగుతుంది అన్న సమంతకి రష్మిక డాన్స్ అన్న, ఆమె శ్రమించే విషయమన్నా నచ్చుతుంది అని చెప్పడంతో రష్మిక అభిమానులు సమంతకు థ్యాంక్స్ చెబుతున్నారు. 

Heroine Samantha talks about Rashmika Dance:

Samantha live Chit Chat Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ