రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన కాంచన సినిమా బాక్సాఫీసుని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకి భారీగా కలెక్షన్లు వచ్చాయి. కామెడీ హార్రర్ ని మిస్ చేసి సక్సెస్ అయిన మొదటి సినిమాగా కాంచనని చెప్పుకోవచ్చు. దాంతో అప్పటి నుండి దర్శకులందరూ ఈ జోనర్ లో సినిమాలు తీయడం ప్రారంభించారు. అయితే ఈ సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు.
ఈ పాటికే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతుండడంతో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో నిర్మాతలందరూ ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే పెద్ద సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేస్తే లాభాలు రావు. కానీ అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం.
ఇంతవరకూ ఓటీటీలో ఎవ్వరికీ ఇవ్వని రేటుని లక్ష్మీ బాంబ్ సినిమాకి వచ్చిందని చెప్పుకుంటున్నారు. సుమారు 120 కోట్ల రూపాయలకి లక్ష్మీ బాంబ్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయాయని టాక్ వినబడుతోంది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుంటే ఆ మాత్రం చెల్లించడం కరెక్టే అని అంటున్నారు.