Advertisementt

జాన్వీ కపూర్‌కు పెద్దరికం వచ్చేసింది

Fri 29th May 2020 06:44 PM
janhvi kapoor,kushi kapoor,family,sridevi,boney kapoor  జాన్వీ కపూర్‌కు పెద్దరికం వచ్చేసింది
Janhvi Kapoor On Becoming The Lady Of The Kapoor House జాన్వీ కపూర్‌కు పెద్దరికం వచ్చేసింది
Advertisement
Ads by CJ

టాప్ మాజీ హీరోయిన్ శ్రీదేవి సినిమాలకు దూరమైనప్పటికీ, భర్త బోని కపూర్ ని, పిల్లలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంది. తాను మరణించేవరకు తన సంతోషాన్ని తన కుటుంబంలోనే చూసుకుంది. కూతుళ్లు జాన్వీ, ఖుషి వెన్నంటే ఉండేది. అయితే శ్రీదేవి మరణంతో బోని, జాన్వీ, ఖుషి ఒంటరివారయ్యారు. జాన్వీ కపూర్ అయితే సినిమా షూటింగ్స్ తో బిజీగా కాస్త తల్లిని ఆదమరిచినా.. బోని భార్యని, ఖుషి తల్లిని మరువలేదు. అయితే తాజాగా జాన్వీ కపూర్ కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అమ్మ మరణం తర్వాత నాన్న, చెల్లి నాపై ఆధారపడతారనుకోలేదు... అంటూ సంచలనంగా మాట్లాడింది. అయితే జాన్వీ కపూర్ తన సంపాదనపై తండ్రి, చెల్లెలు ఆధారపడతారని చెప్పడం లేదు.

గత రెండేళ్లలో షూటింగ్స్ తో బిజీగా ఉండే తాను ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నా అని, అయితే ఇంట్లో తండ్రి, చెల్లి ఖుషి గురించి తెలుసుకుంటున్నా అని, అసలు ఇంట్లోని బాధ్యతలను చూసే మహిళనవుతానని ఎప్పుడూ అనుకోలేదని చెబుతుంది. ఎందుకంటే నాది చిన్న పిల్లల మనస్తత్వం. నేనే ఇతరులపై ఆధారపడతాను. అలాంటిది లాక్ డౌన్ సమయంలో నా పై తండ్రి, చెల్లి ఇంతగా ఆధారపడతారనుకోలేదని చెబుతుంది. గత రెండేళ్లలో తండ్రి తో చెల్లితో ఎక్కువ టైం గడిపింది ఇప్పుడే అని, తండ్రి ఏం తింటాడో? చెల్లి ఖుషి ఎందుకంతసేపు నిద్రపోతుందో? పనివాళ్ళు వంట ఎలా చేస్తున్నారో? కూరగాయలు బయటనుండి తెచ్చి, కడిగి శుభ్రంగా వండుతున్నారా? కరోనా పై ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు పాటిస్తున్నారా? ఇలా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నా అని చెబుతుంది. ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే ఏం జరిగేది అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది అని చెబుతుంది. ఇక తండ్రి, చెల్లి కొంతమేర నాపై ఆధారపడుతున్నారనిపిస్తుంది అంటుంది జాన్వీ కపూర్. 

Janhvi Kapoor On Becoming The Lady Of The Kapoor House:

Janhvi Kapoor on her family 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ