Advertisementt

బన్నీ పుష్పకి జరినట్టే మహేష్ కి కూడా జరిగింది..

Thu 28th May 2020 03:08 PM
bunny,allu arjun,pushpa,mahesh babu,sarkari vaari paata,parashuram,krishna  బన్నీ పుష్పకి జరినట్టే మహేష్ కి కూడా జరిగింది..
Mahesh next movie Title goes viral on Online బన్నీ పుష్పకి జరినట్టే మహేష్ కి కూడా జరిగింది..
Advertisement
Ads by CJ

స్టార్ హీరో సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తుందంటే చాలు అందరి కళ్ళు అటువైపే ఉంటాయి. ఇక అభిమానుల సందడి మామూలుగా ఉండదు. సినిమా లాంచింగ్ నుండి మొదలుపెడితే మధ్య మధ్యలో వచ్చే అప్డేట్లతో కలుపుకుని చివరికి రిలీజ్ అయ్యేవరకూ అదే సందడి. ఏవేవో ఊహాగానాలు, అనేక పుకార్లు సినిమా కథ ఇదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యానాలు..మొత్తంగా స్టార్ హీరో సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ఇలాగే ఉంటుంది.

అయితే ఈ మధ్య సినిమా టైటిళ్ళు ముందుగానే తెలిసిపోతున్నాయి. కారణం ఏంటో తెలియదు గానీ సినిమా నిర్మాతలు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి, దానికోసం ప్రత్యేక ముహూర్తం లాంటివి చూసుకుని మరీ అప్డేట్ ఇద్దామనుకుంటే రెండురోజుల ముందే సినిమా టైటిల్ ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యి వైరల్ అవుతోంది. దీంతో నిర్మాతల ప్లానింగ్ అంతా వృధా అవుతోంది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్ర టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరశురామ్ దర్శకత్వంలో సర్కారి వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. మే 31వ తేదీ క్రిష్ణగారి జన్మదిన్నాని పురస్కరించుకుని రివీల్ చేద్దామనుకున్న టైటిల్ ముందే రివీల్ కావడం చిత్రబృందానికి షాకింగ్ గా ఉందట. అయితే ఇది మహేష్ ఒక్కడికే కాదు, బన్నీ పుష్ప విషయంలోనూ అలాగే జరిగింది.

బన్నీ పుట్టినరోజున అనౌన్స్ చేద్దామనుకున్న టైటిల్ ఒకరోజు ముందుగానే బయటకి వచ్చింది. అభిమానుల్లో ఉండే ఆసక్తిని అందరి కంటే ముందే క్యాష్ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరి పుష్ప లాగే ఇప్పుడు సర్కారి వారి పాట కూడా ఒరిజినల్ టైటిల్ అవుతుందా లేదా చూడాలి.

Mahesh next movie Title goes viral on Online:

Mahesh New movie title would Sarkari Vaari Paata

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ