రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి వరల్డ్ వైడ్‌గా అనేక రికార్డులకు నెలవుగా మారింది. బాహుబలి విజయాన్ని చూసి బాలీవుడ్ హీరోలే బేరమన్నారు. అందుకే బాహుబలి విజయాన్ని అక్కడి హీరోలు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ సౌత్ డైరెక్టర్ ఇలా రికార్డులను బ్రేక్ చెయ్యడం బాలీవుడ్ కి బొత్తిగా నచ్చలేదు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ దిగ్గజం ఒకాయన బాహుబలి కన్నా నా సినిమానే గొప్ప అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పడు అందరిలో ఆసక్తి గా మారింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఓ ట్వీట్ చేసాడు. అది తానూ 1977లో నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా విడుదలై నేటికీ 43 మూడేళ్లు పూర్తయ్యింది అని. ఆ సినిమా అప్పట్లో రికార్డులను బ్రేక్ చేసింది అనే విషయం అందరికి తెలిసిందే.
అయితే 1977లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని సినిమా అప్పట్లోనే 7.25 కోట్లు కొల్లగొట్టింది. అయితే అప్పట్లో ఏడు కోట్లు అంటే ఇప్పుడు 500 కోట్లకు పైమాటే., అందుకే అమితాబ్ తన అమర్ అక్బర్ ఆంటోని సినిమా బాహుబలి కన్నా ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టింది అని చెబుతున్నాడు. 43 ఏళ్ళ క్రితం అమర్ అక్బర్ ఆంటోని 7.25 కోట్లు కోళ్లగొట్టిన ఈ సినిమా ఒక్క ముంబై లోనే 25 వారాల పాటు 25 థియేటర్స్ లో ఆడింది అని చెబుతున్నాడు. ఇక అమర్ అక్బర్ ఆంటోని అప్పటి లెక్కలను పోలిస్తే ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ కొల్లగొట్టిన 510 కోట్ల కన్నా ఎక్కువ అని అప్పట్లో టికెట్ రేటు 2 రూపాయలతో ఇప్పుడు టికెట్ ధర 150 తో పోలిస్తే అమర్ అక్బర్ అంటోనీ బాహుబలి కన్నా ఎక్కువ కొల్లగొట్టిన చిత్రమని అమితాబ్ పేర్కొన్నారు.