Advertisementt

చిరుకు అక్కగా రాములక్క అస్సలు చేయదట!

Thu 28th May 2020 10:58 AM
chiru sister role,chiranjeevi,vijayashanthi,ramulamma,ramulakka,chiru and vijaysanthi  చిరుకు అక్కగా రాములక్క అస్సలు చేయదట!
I Did Not Act As Chiru Sister Says Vijayashanthi! చిరుకు అక్కగా రాములక్క అస్సలు చేయదట!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి కాంబోలో సినిమా వస్తోందంటే సినీ ప్రియులు, మెగాభిమానులకు పట్టలేని ఆనందం. అదే రేంజ్‌లోనే మూవీ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యేది. అప్పట్లో ఈ ఇద్దరిది సక్సెస్ ఫుల్ జంట. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ కాంబోలో సినిమా అస్సలు జరిగే పని కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాములమ్మ సెట్ అవుతుందేమో కానీ హీరోయిన్ అంటే ఇప్పుడు జరిగే పని కాదు. ఒకవేళ హీరోయిన్ అన్నా ఏ ఫ్లాష్ బ్యాక్‌కో సెట్ అవుతుందేమో. అంతకు మించి సిస్టర్‌గా, గురువుగా లాంటి పాత్రలకు అస్సలు సెట్ అయ్యే పరిస్థితుల్లేవ్. ఇటీవలే లూసిఫర్ రీమేక్‌లో మెగాస్టార్‌కు సిస్టర్‌గా చేస్తోందని వార్తలు వినిపించాయి. 

అంతేకాదు.. పాత్ర డిమాండ్ చేయడంతో కాదనలేక రాములమ్మ ఒప్పేసుకుందని.. అసలే చిరు సరసన కదా.. అదీ కూడా సుమారు 15 ఏళ్ల తర్వాత చిరు సరసన మళ్లీ నటించే అవకాశం రావడంతో విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా కొన్ని వెబ్ సైట్స్ కథనాలు వండేశాయి. అయితే ఓ ప్రముఖ దిన పత్రికకు చెందిన సినిమా ప్రతినిధి రాములమ్మను సంప్రదించగా.. ‘నన్ను ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదు. అస్సలు చిరుకు అక్కగా నటించడానికి నేను అస్సలు సిద్ధంగా లేను. ఇలాంటి పాత్రలు బహుశా అభిమానులు యాక్సెప్ట్ చేయరేమో. ఫ్లాష్ బ్యాక్‌ లేదా సరిలేరు నీకెవ్వరులో లాంటి మంచి పాత్ర ఉంటే తప్ప అక్కగా చేయడానికి నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను’ అని తేల్చి చెప్పేసిందట. సో.. ఇలా పుకార్లు వచ్చాయో లేదో.. రాములమ్మ అలా ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న మాట. మరి ఇకనైనా పుకార్లు ఆగుతాయో లేదో వేచి చూడాలి.

I Did Not Act As Chiru Sister Says Vijayashanthi!:

I Did Not Act As Chiru Sister Says Vijayashanthi!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ