Advertisementt

బన్నీ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది!

Thu 28th May 2020 03:18 AM
powerful script,stylish star allu arjun,surender reddy,vakkantham vamsi,race gurram combo  బన్నీ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది!
Powerful Script For Stylish Star Allu Arjun! బన్నీ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రొటీన్ కథలకు కాకుండా కొత్త కొత్త కథలకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి కథలు చాలానే ట్రై చేశాడు.. వాటిలో చాలావరకు సక్సెస్ కాగా.. మరికొన్ని మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే.. బన్నీ కెరీర్‌లో ‘రేసుగుర్రం’ మంచి రేంజ్ తెచ్చిపెట్టిందన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జగమెరిగిన సత్యమే. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి అహర్నిశలు పడ్డ కష్టమే ఇందుకు నిదర్శనం. దీంతో ఒక్క క్లాస్‌కే కాకుండా మాస్ ఆడియాన్స్‌కు కూడా బన్నీ బాగా దగ్గరయ్యాడు.

కాగా.. ఈ సినిమా సక్సెస్ కావడంలో సురేందర్ పాత్ర ఎంత ఉందో.. కథ అందించిన దర్శక రచయిత వక్కంతం వంశీ పాత్ర కూడా అంతే. ఈ కథకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించాడు. అయితే బన్నీ-సురేందర్-వక్కంతం కాంబోలో మళ్లీ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి బన్నీ కోసం అదిరిపోయే.. పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలియవచ్చింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయట. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే బన్నీ ‘పుష్ప’, ‘ఐకాన్’ తర్వాత పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. వాస్తవానికి ఈ కాంబోలో ‘రేసుగుర్రం-2’ వస్తోందని ఎప్పట్నుంచో కథనాలు వస్తున్నాయి. అయితే సీక్వెల్‌ అంతగా వర్కవుట్ అవుతుందో లేదోనని డైరెక్ట్ కథనే సిద్ధం చేస్తున్నారట. సో.. మొత్తానికి చూస్తే ‘రేసుగుర్రం’ కాంబో రిపీట్ అవుతోందన్న మాట. మరి కథ ఎలా ఉంటుందో.. మంచి ఊపు మీదున్న బన్నీ రేంజ్‌ను మరింత పెంచుతుందో లేదో చూడాలి.

Powerful Script For Stylish Star Allu Arjun!:

Powerful Script For Stylish Star Allu Arjun!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ