Advertisementt

‘బిగ్ బాస్’కీ బ్రేక్ పడేలానే ఉంది..!

Thu 28th May 2020 01:53 AM
bigg boss telugu season 4,nagarjuna,lock down,corona,bigg boss,telugu  ‘బిగ్ బాస్’కీ బ్రేక్ పడేలానే ఉంది..!
Corona Effect on Bigg Boss season 4 ‘బిగ్ బాస్’కీ బ్రేక్ పడేలానే ఉంది..!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ కాగా.. సీజన్ టు సో సో హిట్ అయ్యింది. మళ్లీ సీజన్ 3 కూడా బాగా క్రేజ్ సంపాదించుకుని సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు రాబోయే సీజన్ 4 మీద భారీ అంచనాలే ఉన్నాయి. బుల్లితెర మీద ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్స్ సమయంలో బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని... హోస్ట్ గా నాగార్జున ని సంప్రదించి.. ఇక బిగ్ బాస్ ని అన్ని విధాలుగా రెడీ చేసుకుని కరోనా లాక్ డౌన్ ముగిసాక కొద్ది రోజుల్ గ్యాప్ తో మొదలెడదామని అనుకుంటున్నారు.

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ లో చాలామంది అంటే కాస్త పేరున్న కంటెస్టెంట్స్ కరోనా భయంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి వెనకాడుతున్నట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. సోషల్ డిస్టెన్స్ అంటూ కరోనా భయంతో చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చేందుకు జంకుతున్నారని, వారిలో కాస్త నోటెడ్ సెలబ్రిటీస్ ఉండడంతో.. ఇప్పడు బిగ్ బాస్ యాజమాన్యానికి ఏం చెయ్యాలో తోచడం లేదని అంటున్నారు. అన్ని పూర్తయ్యాక ఇలా హ్యాండ్ ఇస్తే.. తామేం చెయ్యాలి అని బిగ్ బాస్ యాజమాన్యం తలపట్టుకున్నట్టుగా ఫిలింనగర్ గుసగుసలు. 

Corona Effect on Bigg Boss season 4:

Bigg Boss telugu season 4 latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ