Advertisementt

‘పుష్ప’లో సుమ ఉత్తుత్తిదే..!!

Thu 28th May 2020 01:49 AM
suma,allu arjun,pushpa,special role,fake,rumour,anchor suma,sukumar,anasuya  ‘పుష్ప’లో సుమ ఉత్తుత్తిదే..!!
No Suma in Allu Arjun Pushpa Movie ‘పుష్ప’లో సుమ ఉత్తుత్తిదే..!!
Advertisement
Ads by CJ

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న పుష్ప సినిమా కరోనా లాక్ డౌన్ అలా ముగియగానే ఇలా సినిమా సెట్స్ మీదకెళ్లడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బన్నీ లుక్ టెస్ట్, సుకుమార్ స్క్రిప్ట్ అన్ని రెడీగా ఉండడంతో పుష్ప ని ఎప్పుడెప్పుడు మొదలెడదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా... సుకుమార్ ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ క్రేజియస్ట్ యాంకర్ సుమని సంప్రదించినట్టుగా టాలీవుడ్ మీడియా టాక్.

తెలుగులో విపరీతమైన క్రేజున్న యాంకర్ సుమకి సుకుమార్ అవకాశం ఇచ్చాడనే టాక్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో యాంకర్ అనసూయని తీసుకొచ్చి రంగస్థలంలో రంగమ్మత్త అనే కేరెక్టర్ ఇచ్చి.. అనసూయకి బాగా హెల్ప్ చేసిన సుకుమార్ ఈసారి మరో కీలక పాత్రకి సుమని తీసుకోబోతున్నాడనే టాక్ వినబడుతుంది. నటిగా సక్సెస్ అవలేక యాంకరింగ్ రంగంలోనే ఇప్పటికి దున్నేస్తున్న సుమ, సుకుమార్ ఆఫర్ కి ఒప్పుకుంటుందో లేదో అనుకుంటుంటే.. మరోపక్క సుమని పుష్ప సినిమాలో మీకు ఓ స్పెషల్ రోల్ వచ్చిందటగా.. సుకుమార్ తో సినిమా చేస్తున్నారా అని అడగగా.. అబ్బే లాంటిదేం లేదని.. నేను పుష్ప సినిమాలో చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే గతంలో రంగస్థలం లో కీ రోల్ ఇచ్చినట్టుగానే ఈసారి కూడా అనసూయ కి సుకుమార్ పుష్ప లోను ఓ మంచి రోల్ సిద్ధం చేసాడని ఎప్పటినుండి ప్రచారంలో ఉన్నట్టుగా.. అదే నిజమని అంటున్నారు. 

No Suma in Allu Arjun Pushpa Movie:

Suma in Pushpa movie.. It is a romour 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ