Advertisementt

వంశీ పైడిపల్లి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు..?

Wed 27th May 2020 02:29 PM
vamshi paidipally,mahesh babu,telugu film,parashuram  వంశీ పైడిపల్లి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు..?
Vamshi trying for Mahesh Babu again.. వంశీ పైడిపల్లి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు..?
Advertisement
Ads by CJ

మహర్షి సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకి మంచి హిట్ అందించిన వంశీ పైడిపల్లి, ఆ తర్వాతి చిత్రాన్ని కూడా మహేష్ తో తీద్దామనుకుని సంవత్సరం వరకూ వెయిట్ చేశాడు. అయితే వంశీ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన మహేష్, ఫుల్ స్క్రిప్టు నచ్చక వంశీతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడని అన్నారు. ఏది నిజమో తెలియదు గానీ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని అనుకున్న వాళ్లకి షాక్ తగిలింది.

ప్రస్తుతం మహేష్ బాబు- పరశురామ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని రోజూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి అధికారిక సమాచారం ఈ నెల 31వ తేదీ క్రిష్ణ గారి జన్మదినం సందర్భంగా రానుందని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి మహేష్ కోసం మరో కథని సిద్ధం చేస్తున్నాడని టాక్ వినబడుతుంది. ఇంతకుముందు రాసుకున్న కథని పూర్తిగా పక్కకి పెట్టి మరో వైవిధ్యమైన కథని మహేష్ దగ్గరికి తీసుకురాబోతున్నాడట.

వంశీతో సినిమా చేస్తానని మహేష్ కమిట్ మెంట్ ఇవ్వడంతోనే మరో కథని సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు పెట్టుకుంటున్నారు. మరి ఈ కథని మహేష్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి. ఒకవేళ ఒప్పుకున్నా రాజమౌళితో సినిమా తర్వాతే వంశీతో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంటే వంశీ మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. మరి వంశీ అప్పటి వరకూ వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో సినిమా చేస్తాడా చూడాలి.

Vamshi trying for Mahesh Babu again..:

Vamshi Paidipally Trying Mahesh Babu again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ