Advertisementt

సర్కారి వారి పాట అంటున్న మహేష్..?

Wed 27th May 2020 11:11 AM
mahesh babu,parashuram,krishna,telugu,telugu film industry  సర్కారి వారి పాట అంటున్న మహేష్..?
Differenrt title for Maheshs Next..? సర్కారి వారి పాట అంటున్న మహేష్..?
Advertisement

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తున్నాడనేది ఆసక్తిగా మారింది. గీత గోవిందం పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 31వ తేదీన క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ సినిమాపై అప్డేట్ రానుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలు ఫలించే అవకాశం మెండుగా కనిపిస్తుంది.

మే 31వ తేదీన మహేష్- పరశురామ్ ల కాంబో సినిమా లాంచ్ కానుందట. అప్పుడే ఆ సినిమా టైటిల్ కూడా బయటకి వచ్చేసింది. సర్కారి వారి పాట అనే డిఫరెంట్ టైటిల్ ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ టైటిల్ ని చూస్తుంటే, పరశురామ్ ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. గతంలో ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన పరశురామ్ మహేష్ బాబు అభిమానులకి కావాల్సిన అన్ని మాస్ అంశాలు తన సినిమాలో ఉండనున్నాయని చెప్పాడు.

ఇపుడు బయటకి వచ్చిన ఈ టైటిల్ ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులని బాగా కనెక్ట్ చేసే టైటిల్ నే పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే వరకు మహేష్ అభిమానులకి ఒకరకమైన టెన్షన్ తప్పదు.

Differenrt title for Maheshs Next..?:

Sarkari vaari Paata Title for  Mahesh Next

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement