ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన మ్యాడ్ మూవీ ఈసారి సుఫీ తో తన ప్రత్యేకతను చాటుకుంది. తెలుగు పాటలలో చాలా అరుదుగా కనిపించే సుఫీ పాట మ్యాడ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘బందిషీ ఖాతల్ దిల్ కీ’’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ గొంతులో ప్రాణం పోసుకుంది. సింగర్ గా ఇండియన్ మ్యూజిక్ పై చెరిగిపోని సంతకం చేసిన కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్షకుల మనసులో శాశ్విత స్థానం సంపాదించుకుంది.మోహిత్ రెహ్మానిక్ స్వర పరచిన ఈ సుఫీని శ్రీమాన్ శ్రీమనస్వి రచించారు. మోదెల టాకీస్ బ్యానర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాతలుగా లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. కైలాష్ ఖేర్ గారు మా పాటను ఒప్పుకోవడం చాలా అదృష్టంగా భావించాము.. సినిమాలో ఒక ఎమోషనల్ సిట్యువేషన్ లో ఈ పాట వస్తుంది. కథలోని ఫీల్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సుఫీ అయితే కొత్త గా ఉంటుంది చాలా ప్రెష్ ఫీల్ కలుగుతుందని అనుకున్నాం.. మా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంది. కైలాష్ ఖేర్ గారు పాట విన్నాక మాకు కలిగిన ఆనందం అంతా ఇంతాకాదు.. సినిమా కు ఈ సాంగ్ హైలెట్ గామారుతుందని మా నమ్మకం .. ఒక రియలిస్టిక్ అప్రోచ్ లో కథా, కథనాలు సాగుతాయి. ఈ జనరేషన్ ప్రేమకథలలో మనం నిత్యం చూసే కథలే ఇందులో చూపించాం. అన్నారు..
నటీనటులు.. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ తదితరులు నటించగా..
బ్యానర్: మోదెల టాకీస్
ప్రోడ్యూసర్స్: టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ ఏలూరు
కెమెరా: రఘు మందాటి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: మోహిత్ రెహ్మానియాక్
లిరిక్స్: ప్రియాంక, శ్రీరామ్
పి ఆర్ ఓ: జియస్ కె మీడియా