అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్, సుశాంత్ హీరోగా చేసిన చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారాడు. సాధారణంగా దర్శకులుగా ఉన్నవారు హీరోలుగా మారుతుంటారు. కానీ రాహుల్ రవీంద్రన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే దర్శకునిగా మారాడు. మొదటి సినిమా చిలసౌ తో విమర్శకులని మెప్పించి ప్రశంసలు అందుకోవడమే కాదు, స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.
అయితే ఆ తర్వాత నాగార్జున హీరోగా మన్మధుడు 2 సినిమాతో డిజాస్టర్ ని తీసి విమర్శలకి గురయ్యాడు. ప్రస్తుతం రాహుల్ రవీంద్ర వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడు. కరోనా కారణంగా జనాలు ఓటీటీలకి బాగానే అలవాటు పడ్డారు. అదీగాక తెలుగులోనూ వెబ్ సిరీస్ ల హవా మొదలైంది. దాంతో ప్రతీ ఒక్కరి దృష్టి వీటిపై పడింది. అందుకే రాహుల్ రవీంద్ర వెబ్ సిరీస్ తీసేందుకు రెడీ అవుతున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ పై వెన్నెల కిషోర్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ రూపొందించనున్నాడని టాక్ వినబడుతుంది.
అధికారికంగా ఈ విషయమై ఎలాంటి సమాచారం రానప్పటికీ, రాహుల్ రవీంద్ర వెబ్ సిరీస్ పట్ల బాగా ఆసక్తిగా ఉన్నాడని, ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేశాడని మాట్లాడుకుంటున్నారు.