మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మల్టీస్టారర్ లో విక్టరీ వెంకటేష్ తో పాటు నేచురల్ స్టార్ నాని కూడా స్క్రీన్ ని పంచుకోనున్నాడట. ప్రస్తుతం వీరిద్దరూ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి క్రేజీ రూమర్ పుట్టుకొచ్చింది. అయితే ఇలా పుట్టుకురావడానికి కారణం కూడా లేకపోలేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు.
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, అక్కడ తన పని ముగించుకున్న తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు. ప్రస్తుతానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పనులు ఎప్పుడు ముగుస్తాయో ఒక క్లారిటీ లేదు. సంక్రాంతి బరిలో నుండి ఆర్ ఆర్ ఆర్ తప్పుకుంది కూడా. సో ఎన్టీఆర్ మరో సంవత్సరం వరకూ త్రివిక్రమ్ కి దొరికే ఛాన్స్ లేదు. అందువల్ల ఈ ఖాళీ టైమ్ లో ఒక సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడని టాక్.
సంవత్సరం పాటు ఖాళీగా ఉండేకంటే మరో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ కూడా అనుకుంటున్నాడని వినబడుతుంది. మరి ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యే వరకూ త్రివిక్రమ్ ఆగుతాడా, లేదా ఆ గ్యాప్ లో వెంకీ, నానిలతో మరో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.